బంగారం స్మగ్లింగ్ కేసుతో సీఎం పినరయ్‌….. స్వప్న సురేష్‌

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్డీఎఫ్‌ సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కీలక పాత్రధారి ముఖ్యమంత్రి పినారయి విజయన్ అంటూ కస్టమ్స్ అధికారులు కోర్టుకు నివేదించడంతో రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం చెలరేగింది. 
ఈ కేసులో ప్రధాన సూత్రధారి స్వప్న సురేష్‌ సంచలన విషయాలు వెల్లడించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని, ఆయన నిండా మునిగారని కస్టమ్స్ అధికారులకు చెప్పారు. సీఎం పినరయ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు. 
 
ముగ్గురు మంత్రులతో పాటు స్పీకర్ కూడా ఇందులో పాత్రధారి అంటూ ఆమె వెల్లడించారు.  సీఎం పినరయి విజయన్‌కు అరబిక్‌ మాట్లాడటం, అర్ధం చేసుకోవడం రాని క్రమంలో కాన్సులేట్‌ జనరల్‌, ముఖ్యమంత్రి మధ్య సాగిన సంప్రదింపులకు స్వప్నా సురేష్‌ మీడియేటర్‌గా వ్యవహరించేవారని తెలిపారు. 
 
ఈ ఒప్పందంలో ముఖ్యమంత్రి, మంత్రులు రూ కోట్లలో కమిషన్‌ పొందారని స్వప్నా సురేష్‌ స్టేట్‌మెంట్‌ వెల్లడించిందని కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 
 
‘‘సీఎం విజయన్‌ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సీఎం విజయన్‌కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్‌లో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు.’’ అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు విలువచేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం కేరళను కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
ఈ సందర్భంగా కేరళ ప్రతిపక్ష నాయుకుడు రమేశ్‌ చెన్నితాలా మాట్లాడుతూ.. ‘‘గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మొదటి నుంచి మేం ఏం ఊహించామో అదే జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని మేం ముందే గుర్తించాం. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు’’ అన్నారు.