2020లో టివిలో అత్యధికంగా వీక్షించింది ప్రధాని మోదీనే 

బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) 2019-2020 వార్షిక టీవీ వ్యూవర్‌షిప్ నివేదిక ప్రకారం గత ఏడాది భారతదేశంలో టెలి విజన్‌లో అత్యధికంగా వీక్షించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.   దేశంలో కలకలం సృష్టించిన  కోవిడ్ మహమ్మారికి సంబంధించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని పలు సార్లు చేసిన ప్రసంగాలతో పాటు కోవిద్ -19 టీకాల ఎగుమతి నుండి కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించి ఆయన చేసిన ప్రజలను  దేశంలో అత్యధికంగా ప్రజలు వీక్షించారు.

“అవి ఆయనతో  ఇంటర్వ్యూలు, అంతర్జాతీయ కార్యక్రమాలను ఉద్దేశించి ప్రధాని చేసిన  ప్రసంగాలు, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగాలు లేదా ఆయన పాల్గొన్న  వన్యప్రాణుల అడ్వెంచర్ షో లకు సంబంధించి ప్రసారాల అయినా, కంటెంట్ను ప్రసారం చేసే ఛానెల్స్ వారి వీక్షకుల వీక్షణను కొత్త స్థాయికి తీసుకు వెళ్లాయి” అంటి ప్రధాని ప్రసంగాలను ప్రస్తావిస్తూ ఈ నివేదిక పేర్కొన్నది. 

ముఖ్యంగా, ఎర్రకోటలో  రెండు గంటలపాటు ఆయన చేసిన ప్రసంగంను 133 మిలియన్ల మంది వీక్షించారు. 2019 లో ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో పోలిస్తే 40 శాతం వీక్షకుల సంఖ్య పెరిగింది. మార్చి 24, 2020 న మొదటి సారిగా లాక్ డౌన్ ను ప్రకటిస్తూ  ప్రధాని చేసిన ప్రసంగం, అంతకు ముందు ఆయన చేసిన అన్ని ప్రసంగాలకన్నా ఎక్కువమంది వీక్షకులను ఆకర్షించింది. 

2020 ఏప్రిల్‌లో  రూ 20 లక్షల కోట్ల ఆత్మా నిబ్బర్ ప్యాకేజీని ప్రకటిస్తూ ప్రధాని చేసిన ప్రసంగం 203 మిలియన్ల మంది ప్రేక్షకులు ట్యూన్ చేయడంతో అత్యధికంగా వీక్షించిన ప్రసంగంగా  నిలిచింది. “ప్రధాని మోదీ కరోనా సంబంధిత ప్రసంగాలు ఎప్పుడు చేసినా ఆ సమయంలో  జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ (జిఇసి), సినిమాలు, కిడ్స్ వంటి ప్రధాన కార్యక్రమాల  వీక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది” అని నివేదిక వెల్లడించింది. 

కరోనా వారియర్స్ కు సంఘీభావంగా తొమ్మిది నిముషాల పాటు లైట్లు ఆపివేమని ప్రధాని పిలుపు ఇచ్చిన సమయంలో ఆ తొమ్మిది నిమిషాల సమయంలో టీవీ వీక్షకుల సంఖ్య 60 శాతం క్షీణించింది. మహమ్మారి కారణంగా,  ప్రభుత్వ చర్యలు,   ప్రకటనల పట్ల పెరుగుతున్న ఉత్సుకతను అనుసరించి, మొత్తం టీవీ వీక్షకులలో వార్తల వాటా మూడు రెట్లు పెరిగిందని. సాధారణంగా ప్రతి ఏడు టివి వార్తల వీక్షకుల సంఖ్య పెరుగుదల 7 సాతంగ్ మాత్రమే ఉంటూ ఉండెడిది. 

గత సంవత్సరం, హిందీ జిఇసి కళా ప్రక్రియకు పౌరాణిక ప్రదర్శనల  వీక్షకుల సంఖ్య 15 వ వారం నాటికి కేవలం 14 శాతం మాత్రమే ఉండగా,  43 శాతానికి పెరిగింది. కోవిడ్ మార్గదర్శకాల కారణంగా క్రొత్త కంటెంట్ ఏదీ  ఈ ఏడాది సృష్టించబడలేదు,. దానితో పాత కార్యక్రమాలనే తిరిగి భారీగా ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బహుశా అత్యధికంగా లాభపడింది  దూరదర్శన్ (డిడి). 

“రామాయణం”,  “మహాభారతం”,  ఎనభైల, తొంభైల, ఇతర ప్రముఖ టీవీ షోలను తిరిగి ప్రసారం చేయడానికి ఛానల్ తీసుకున్న నిర్ణయంతో ఛానెల్ ల మొత్తం వీక్షకుల సంఖ్య గత సంవత్సరం 68 శాతం పెరిగింది. అసలు కంటెంట్ లేకపోవడం వల్ల ప్రారంభ నష్టాన్ని చవిచూసిన జిఇసిల మాదిరిగా కాకుండా,  సినిమా సంబంధ కార్యక్రమాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదు. వీటి ప్రేక్షకుల సంఖ్య 2019తో పోల్చితే 10 శాతం పెరిగింది. 

“ప్రాంతీయ చలన చిత్రాల శైలి వారి హిందీ ప్రతిరూపం కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది, అయినప్పటికీ హిందీ భాషా శైలి మొత్తం సినిమా శైలుల వీక్షకులలో 60 శాతానికి చేరుకుంది. హిందీతో పాటు, ఈ తరానికి సంబంధించిన ఇతర ప్రధాన మార్కెట్లు తెలుగు, తమిళం , కన్నడ సినిమాలకు ఉంది ”అని నివేదిక పేర్కొంది.