
హైదరాబాద్ నగరంలోని సన్‌సిటీలో యువతిపై జరిగిన దాడి లవ్ జీహాదేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. హిందు యువతులు ప్రేమకు ఒప్పుకోకుంటే ముస్లిం యువత లవ్ జిహాదీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. హిందు మహిళల జోలికి వస్తే వారి తాట తీస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిపై ముస్లిం యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన షారూఖ్ సల్మాన్ నగరంలో పనిచేస్తున్నాడు. ప్రేమ పేరుతో యువతిపై దాడి చేశాడు.
దాడి చేసి పారిపోతున్న సల్మాన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల కాలంలో తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయని, హిందువుల అమ్మాయిలపై దాడులు ఘటనలు బయటకు రానివి అనేకం ఉన్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందు అమ్మాయిల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయని తెలుపుతూ అదే విధంగా హిందు అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ ను ఆయన డిమాండ్ చేశారు.
More Stories
తెలంగాణ మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం
కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి రెండేళ్లు పొడిగించాలి
కన్నుల పండువగా విద్యారణ్యం వేద పాఠశాల వార్షికోత్సవం