గుజరాత్‌లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది

గుజరాత్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పష్టం చేశారు. గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 45 సీట్లను గెలుచుకుందని సీఎం చెప్పారు. 
 
2015వ సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికల్లో 389 సీట్లున్న బీజేపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో 489 స్థానాలు కైవసం చేసుకుందని సీఎం చెప్పారు. మున్సిపాల్టీల్లో 174 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 45 సీట్లకు పడిపోయిందని చెప్పారు. చాలా మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ తుడచిపెట్టుకుపోయిందని, కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా పోయినదని పేర్కొన్నారు. 
 
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని సీఎం రూపానీ చెప్పారు.అహ్మదాబాద్, జాంనగర్, భావనగర్, సూరత్, రాజ్ కోట్, వడోదర నగరాల్లో బీజేపీ బలం అనూహ్యంగా 489 సీట్లకు పెరగ్గా కాంగ్రెస్ బలం 174 నుంచి 45కు పడిపోయిందని సీఎం రూపానీ వివరించారు.