దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళ మృతులకు నివాళులు

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళలో (21-02-2021) ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రేలుళ్ళు జరిగిన రోజైన ఆదివారం నాది ఉగ్రవాద వ్యతిరేక వేదిక (ఎటిఎఫ్) ఆధ్వర్యంలో ప్రేలుళ్ళు జరిగిన ప్రదేశంలో ఘన నివాళులు అర్పించారు. మతోన్మాద ఉగ్రవాదాన్ని అణిచి వేయడానికి పోటా లాంటి కఠిన చట్టాలు చేయాలని ఈ సందర్భంగా ఎటిఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థలను నిషేధించాలని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో తిష్టవేసిన రోహంగియాలను,  , బంగ్లాదేశీయులను వెంటనే అరెస్టు చేసి వెనక్కు పంపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన, గాయాలపాలై ఇప్పటికీ జీవితంలో నరకం అనుభవిస్తున్న కుటుంబాలకు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వ నుండి సరైన సహాయం అందలేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలోఎటిఎఫ్  కన్వీనర్ రావినూతల శశిధర్, నవీన్, రాంరెడ్డి తదితరులతో పాటు నాటి బాంబు పేలుళ్ళలో గాయపడిన క్షతగాత్రులు పాల్గొన్నారు.