ఒపెక్ దేశాలు పెట్రోల్ ఉత్పత్తులు తగ్గించవద్దు

తమ ఉత్పత్తులపై కొత్త విధింప వద్దని ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ), పెక్కు ప్లస్ దేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది. ఆ విధంగా చేయడం భారత దేశంలోని ఇంధన ధరలపై ప్రభావం పడుతుందని భారత పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఇంధనం ధరలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని చెబుతూ అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ఉత్పత్తి తగ్గిస్తుండగా, పెటాలియం ఉత్పత్తుల దేశాలు ఎక్కువ లాభాల కోసం తక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన చెప్పారు. వీటి కారణంగా పెట్రోల్ వినియోగ దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. 
 
గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఇంధనంకు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో గత ఏప్రిల్ లో ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు తమ ఉత్పత్తులను తగ్గించడాన్ని భారత్ సమర్ధించింది. అయితే గత 12 రోజులకు పైగా భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముంబైలో గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్ లీటర్ రూ 97కు, డీజిల్ రూ 88కి పెరిగింది. 
 
కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన ఖర్చుల ప్రభావం కూడా ధరల పెరుగుదలపై ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదాయం సంపాదించాలన్న లక్ష్యంతో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంధన ధరలను పెంచుతున్నాయని పేర్కొన్నారు. 
 
అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తే ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తాయని ఆయన గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సహితం ఆందోళన వ్యక్తం వేశారు. ధరలను తగ్గించడం తప్ప మరేమి చేసిన ప్రజలను శాంతిప చేయలేమని స్పష్టం చేశారు.
పెట్రోల్ ధరల పెరుగుదలపై  ఇటీవల ప్రభుత్వం పార్లమెంటులో స్పందిస్తూ, ధరల పెరుగుదలకు రాష్ట్రాల బాధ్యత కూడా ఉందని కేంద్రం  స్పష్టం చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లపై వ్యాట్ పెంచుతున్నాయని తెలిపింది.  ఇదిలావుండగా, 2020 నవంబరు నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల నుంచి బ్రెంట్ ఆయిల్ రేటు 60 డాలర్లకు పైన ఉంది. 
 
నాలుగు రాష్ట్రాలు ఉపశమన చర్యలు తీసుకున్నాయి. తమ వంతుగా వ్యాట్‌తోపాటు ఇతర పన్నులను తగ్గించి ఈ పెట్రో మంట నుంచి వినియోగదారులకు కొంతవరకు ఊరట కల్పించాయి. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు రూ.100కు చేరువవుతుండటంతో రాజస్థాన్‌ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా జనవరి 29న 38 శాతంగా ఉన్న వ్యాట్‌ను 36 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగారులకు కాస్త ఊరట లభించింది.
అసోం, మేఘాలయ, తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు కూడా ఇదే దారిలో పయనించాయి.  అసోం ప్రభుత్వం గతేడాదిలో కొవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల సేకరణ కోసం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 ట్యాక్స్‌ విధించింది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో ఆ ట్యాక్స్‌ను ఫిబ్రవరి 12న ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో కొంతమేర ధరలు తగ్గాయి.
అదేవిధంగా మేఘాలయ ప్రభుత్వం భారీగా ధరలను తగ్గించింది. పెట్రోల్‌ డీజిల్‌పై రిబేట్‌ రూపంలో రూ.2లను తగ్గించగా, తర్వాత వ్యాట్‌ను పెట్రోల్‌పై 31.62 శాతం నుంచి 20 శాతానికి, డీజిల్‌పై 22.95 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. దీంతో రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.40, డీజిల్‌పై రూ.7.10 తగ్గాయి. ఇక, చమురు ధరలను తగ్గించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను రూ.1 మేర తగ్గించింది.