ప్రభుత్వం పరువు తీసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్

భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొలిక్కి వచ్చిన ఈ తరుణంలో ప్రభుత్వం పరువు తీసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని   రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని సేలం జిల్లాలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత భూభాగాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్పోయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘నేను దేశ రక్షణ శాఖ మంత్రిని. లద్దాఖ్ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏంటని మీరు నన్ను అడుగచ్చు. లద్దాఖ్ ప్రతిష్టంభన అనంతరం.. భారత్-చైనా మధ్య ఇప్పటివరకూ వివిధ స్థాయిల్లో తొమ్మిది మార్లు చర్చలు జరిగాయి. ఆ సమస్యకు పరిష్కారం లభించింది’ అని ఆయన స్పష్టం చేశారు. 

అయితే..కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి మండిపడ్డారు. భారత భూభాగాన్ని చైనాకు వదులుకున్నామని చెబుతోందని దుయ్యబట్టారు. “అయితే నేను మీకో విషయం స్పష్టంగా చెబుతున్నారు. నా ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకూ ఒక్క అంగుళం భూభాగాన్ని ఇతరులెవ్వరూ ఆక్రమించుకోలేరు’ అని ఆయన భరోసా ఇచచ్చారు.

భారత్ సైన్యం పరాక్రమాన్నీ కాంగ్రెస్ శకిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని కాంగ్రెస్ ఆవమానిస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు. అదే విధంగా ఫ్రెంచ్ నుండి భారత్ దిగుమతి చేసుకొంటున్న రఫెల్ జెట్ విమానాల గురించి కూడా కాంగ్రెస్, దాని మిత్రపక్షం డీఎంకే అనుమానాలు కలిగించే ప్రయత్నాలు చేశాయని రక్షణ మంత్రి ధ్వజమేత్తారు. అయితే కాగ్, ఇతర సంస్థలు ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన్నట్లు గుర్తు చేశారు.

అన్నాడీఎంకే, బిజెపి పార్టీలు మాత్రమే తమిళనాడు ప్రజలకు అభివృద్ధిని అందించగలవని స్పష్టం చేస్తూ “రెండు ఆకులు (అన్నాడీఎంకే), కమలం (బిజెపి) మాత్రమే అవినీతికి చోటులేని నిజాయతి పాలన అందించగలవు” అని చెప్పారు.  ప్రభుత్వం ఖర్చు చేసే  ప్రతి రూపాయితో 13 పైసలు మాత్రమే ప్రజలకు అందుతున్నట్లు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన వాఖ్యాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం మొత్తం 100 పైసలు ప్రజలు చేరుతున్నాయని భరోసా వ్యక్తం చేసారు.

తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ పొత్తును ఎద్దేవా చేస్తూ “వారిద్దరూ విచిత్రమైన దంపతలు” అని చెప్పారు. వారిద్దరూ కలసి కాపురం చేస్తున్నా వారిద్దరి మధ్య సారూప్యత ఏమాత్రం లేదని చెప్పారు. కాంగ్రెస్ బరువును అనవసరంగా మోస్తున్నామనే పశ్చాతాపం డీఎంకేలో ఉన్నదని చెప్పారు. వారిద్దరూ కేవలం అవినీతిలో, సంతృప్తి రాజకీయాలు చేయడంలో మాత్రమే కలసి పనిచేస్తున్నారని విమర్శించారు. వారి పొత్తును తమిళ ప్రజలు తిరస్కరిస్తారుని ధీమా వ్యక్తం చేశారు.