
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ప్రపంచానికి భారత దేశం నాయకత్వం అందిస్తోందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ప్రశంసించారు. ప్రపంచానికి కోవిడ్-19 వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు గుటెరస్ భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఫిబ్రవరి 17న లేఖ రాశారని ఐరాసలో భారత దేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ట్వీట్ చేశారు. ఐరాస పీస్ కీపర్స్‌కు రెండు లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను అందజేసినందుకు వ్యక్తిగతంగా జైశంకర్‌కు ధన్యవాదాలు తెలిపారని తిరుమూర్తి పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారిపై స్పందించడంలో భారత దేశం ప్రపంచానికి నాయకత్వం వహించడం ప్రశంసనీయమని గుటెరస్ తెలిపారు. ప్రధాన ఔషధాలు, డయాగ్నొస్టిక్ కిట్స్, వెంటిలేటర్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు, వస్తువులు వంటివాటిని 150కి పైగా దేశాలకు భారత్ సరఫరా చేస్తోందని గుర్తు చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌కు అనుమతి ఇచ్చిన రెండు వ్యాక్సిన్లలో ఒకదాని అభివృద్ధి, తయారీలో భారత దేశం కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత్ కృషి వల్ల గ్లోబల్ వ్యాక్సిన్ మార్కెట్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. కోవాక్స్ ఫెసిలిటీని పటిష్టపరచేందుకు నిరంతరం చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
కోవాక్స్ అంటే, కోవిడ్-19 వ్యాక్సిన్లను న్యాయబద్ధంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా జరుగుతున్న అంతర్జాతీయ కృషి. ఐక్యరాజ్య సమితి పీస్‌కీపర్స్‌కు రెండు లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత దేశం బుధవారం బహుమతిగా ఇచ్చింది.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!