
ఎన్నికలకు రెండు నెలల ముందు కేరళలో ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ (89) బీజేపీలో చేరుతున్నారని కేరళ రాష్ట్ర శాఖ గురువారం ప్రకటించింది. ఈ నెల 21న రాష్ట్రంలో బీజేపీ ‘విజయ యాత్ర’ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని చెబుతూ బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని ఆయన గతంలో నిర్మొహమాటంగా ప్రకటించారు. రెండు పార్టీలూ సొంత లాభాల కోసమే అధికారంలోకి వస్తున్నాయని, ప్రజలను ఉద్దరించే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడంలేదని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కేరళ అభివృద్ధిపథంలో దూసుపోతుందనే నమ్మకం తనకుందన్నారు
శ్రీధరన్… అనగానే మెట్రో రైల్ గుర్తుకొస్తుందిఢిల్లీ మెట్రో రైల్‌కు ఆద్యుడిగా విశేష ప్రాచుర్యం పొందారు. ఢిల్లీ ఆనాటి ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ ఈయనను ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు.
ఈ ప్రాజెక్టును అనుకున్న షెడ్యూల్ కంటే ముందే పూర్తిచేసి అందరి మన్ననలూ అందుకున్నారు. దీంతో ఆయనకు ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ అన్న పేరు కూడా వచ్చింది. 2005 లోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీ మెట్రో రెండో దశ పూర్తి బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత 2011 న పదవీ విరమణ చేశారు
కొంకణ్ రైల్వే, ఢిల్లీ మెట్రోల నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైంది. భారతదేశంలో ప్రజా రవాణా ముఖాన్ని మార్చిన ఘనత శ్రీధరన్‌కే దక్కుతుంది. దేశంలో తొలి మెట్రో ప్రాజెక్ట్ అయిన కోల్‌కతా మెట్రో రైల్ రూపశిల్పి ఆయనే కావడంతో మెట్రోమ్యాన్‌గా గుర్తింపబడ్డారు.
అంతేకాకుండా భారీప్రాజెక్టులు నత్తనడక నడిచే ఈ రోజుల్లో ఆయన తన క్రమశిక్షణతో మెట్రో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి ఢిల్లీ నుంచి హర్యానా, యూపీ వరకూ దాదాపు అన్ని మార్గాల్లో మెట్రోను విస్తరించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు.
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
తమిళనాడు మంత్రులు సెంథిల్, పొన్ముడి రాజీనామాలు