ఆరెస్సెస్‌పై కుమారస్వామి వాఖ్యల పట్ల వీహెచ్‌పీ ఆగ్రహం 

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వని వారి ఇండ్లను ఆరెస్సెస్‌ మార్కింగ్‌ చేస్తోందని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యల పట్ల విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కుమారస్వామి వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరాధార వ్యాఖ్యలు చేశారని మండిపడింది. 

రామ మందిర నిర్మాణానికి వసూలు చేస్తున్న విరాళాలపై కుమారస్వామి చేసిన ట్వీట్‌ బాధ్యతారాహిత్యమైందని ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మందిర నిర్మాణానికి విరాళాల వసూలు బాధ్యతను శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ఆరెస్సెస్‌తో పాటు వీహెచ్‌పీలకు అప్పగంచింది.

దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ రామాలయ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకే నిధి సమర్పణతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా వాలంటీర్లు అన్ని గ్రామాలను సందర్శిస్తున్నారని వీహెచ్‌పీ పేర్కొంది. కాగా, కుమారస్వామి వాఖ్యాలను  ఆరెస్సెస్   కొట్టిపారవేసింది.  అవి ఎటువంటి  స్పందనకు తగినవి కావని ఆరెస్సెస్ ప్రతినిధి ఇ ఎస్ ప్రదీప్ ఎద్దేవా చేశారు.