వాట్సాప్‌ కు సుప్రీం కోర్ట్ మందలింపు!

మీ డబ్బు కన్నా, వ్యక్తిగత గోప్యతే ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను మందలించింది. వాట్సాప్‌ నూతన ప్రైవసీ పాలసీ విధానంతో డేటాను ఇతర కంపెనీలతో పంచుకుంటున్నారని, ఈ పాలసీపై స్టే విధించాలంటూ కర్మన్య సింగ్‌ సరీన్‌ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విధిమే. 
 
దీనిపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతఅత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొత్త పాలసీతో వ్యక్తిగత గోప్యతపై ప్రజల్లో ఆందోళన నెలకొందని, ఇతర కంపెనీలతో పంచుకుంటారనే భయముందని తెలిపింది. అలాగే కంపెనీకి వచ్చే 2, 3 ట్రిలియన్ల విలువైన కంపెనీ కావొచ్చు. కానీ ప్రజలకు వారి వ్యక్తిగత గోప్యత అంతకంటే ఎక్కువ విలువైనది వెల్లడించింది. ఆ ప్రైవసీని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించింది. 
‘మీది  2 నుంచి 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు, కానీ దేశ ప్రజలకు గోప్యత అనేది అన్నింటికంటే చాలా విలువైనది. వారి గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని ఫేస్‌బుక్, వాట్సాప్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. అయితే.. యాప్‌ నిబంధనలు ఐరోపాలో ఒకలా.. మనదేశంలో మరోలా ఉన్నాయని చెప్పడంతో తమ స్పందన తెలియజేయాలంటూ వాట్సాప్‌తో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
వాట్సాప్‌ నూతన గోప్యతా విధానాన్ని తీసుకొస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త విధానంపై అంతర్జాతీయంగా అనేక విమర్శలూ వస్తున్నాయి. దీంతో ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న ఈ విధానం మే 15కు వాయిదా వేసింది.