దిశరవికి పాక్ అధికార పక్షం మద్దతు!

అంతర్జాతీయ పర్యవరణ యాక్టివిస్ట్‌ గ్రెటా థన్‌బర్గ్‌తో ముడిపడి ఉన్న టూల్‌కిట్‌ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు బెంగుళూరుకు చెందిన సామజిక ఉద్యమకారిణి దిశరవిని అరెస్ట్ చేయడంతో దీని వెనుక అంతర్జాతీయ కుట్ర ఉన్నదనే అనుమానాలకు బలం చేకూరుతుంది. దిశరవికీ ఏకంగా పాకిస్తాన్ లోని అధికారపక్షం మద్దతు పలకడంతో ఈ కేసు పలు మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. 
 
ఈ టూల్‌కిట్‌ వెనుక తజకిస్తాన్‌  ఉగ్రవాదులు ఉన్నారనేది ఢిల్లీ పోలీసులు అనుమానం. ఈ క్రమంలోనే గ్రెటా టూల్‌కిట్‌ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎందుర్కొంటున్న పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.
కాగా, ఈ అరెస్ట్ లను ఖండిస్తూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీ‌క్ ఈ‌‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సామాజిక ఉద్యమకారిణి దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రంలోని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్కార్‌ పౌరులు హక్కులను కాలరాస్తోంది’  అంటూ ప్రకటన విడుదల చేసింది.
కశ్మీర్‌ విభజనతో మైనార్టీలను తన గుప్పిట్లోకి తీసుకుంది. దేశంలో క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకుంటోందని అంటూ ట్వీట్‌ చేసింది. ఇండియా హైజాక్‌ ట్విటర్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జతచేసింది. దిశరవికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని పాక్‌ తెలిపింది.
కాగా భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌ తల దూర్చడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేసి వివాదాన్ని మరింత రాజేసింది.