సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమే!

ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, యూట్యూబ్ వంటి సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల ఖాతాల్లో వివాదాస్ప‌ద ఖాతాల‌ను నియంత్రించేందుకు చ‌ట్టాలు తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ముఖ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జాస్వామ్య దేశాల్లో వ్య‌క్తిగ‌త కంపెనీలు ఏకప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం సుదీర్ఘ కాలం స్థిరంగా ఉండ‌డం స‌బ‌బు కాద‌ని చెప్పారు. వాటిని నియంత్రించ‌డానికి చ‌ట్టాలు, నిబంధ‌న‌ల‌తోకూడిన ఫ్రేమ్ వ‌ర్క్ అవ‌స‌రం ఉంద‌ని బ్లూంబ‌ర్గ్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అన్నారు.

ఈ కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ సీఈవో చ‌ర్య‌లు తీసుకున్నా మ‌న‌కు స‌హాయ‌కారిగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో కొంత భ‌యం ఉండటం చాలా ముఖ్యం అని,  అయితే సుదీర్ఘ కాలం అది మార్గం కాద‌ని స్పష్టం చేశారు.

మైక్రోసాఫ్ట్ సంస్థ ప్ర‌స్తుతం క‌న్జూమ‌ర్ సోష‌ల్ మీడియా స‌ర్వీసు అందించ‌డం లేదు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ‌ర్లు మాత్రం.. అమెరికాలో క్యాపిట‌ల్ భ‌వ‌నంపై ట్రంప్ అనుకూల మ‌ద్ద‌తుదారుల విధ్వంసం త‌ర్వాత యాప్‌ల‌తోపాటు సోష‌ల్ మీడియా ఖాతాలు, వ్య‌క్తుల వాయిస్ల‌ను తొల‌గించి వేస్తున్నాయి.