రూ.1.91 లక్షల కోట్ల ఐటి రిఫండ్

ఆదాయం పన్ను శాఖ సుమారు 1.87 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,91,015 కోట్ల ఐటి రిఫండ్ చేసింది. ఈ రిటర్న్‌లు అంతా 2020 ఏప్రిల్ 1 నుండి 2021 ఫిబ్రవరి 8 మధ్య నిర్వహించింది. 
 
రూ.1.87 కోట్ల పన్ను కేసుల్లో రూ .67,334 కోట్లు వ్యక్తిగత ఆదాయ పన్ను రిఫండ్, కార్పొరేట్ పన్ను రిఫండ్ విషయానికొస్తే 2,14,935 కేసుల్లో రూ.1.23 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిటర్న్‌లు చేసినట్లు ఐటి శాఖ తెలిపింది.
 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.74 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ .1.81 లక్షల కోట్లు రిటర్న్‌లు చేశామని ఆదాయపు పన్ను శాఖ గతంలో తెలిపింది. 
 
ఇందులో డిపార్ట్‌మెంట్ వ్యక్తిగత ఆదాయపు పన్ను కింద పన్ను చెల్లింపుదారులకు రూ.62,231 కోట్లు, కంపెనీ పన్ను విషయంలో 2.12 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ .1.19 లక్షల కోట్లు రిటర్న్ చేసింది. 
 
2020 ఏప్రిల్ 1 నుండి 2021 జనవరి 25 మధ్య కాలంలో 1.74 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు సిబిడిటి రూ.1,81,336 కోట్ల రిటర్న్‌లు ఇచ్చిందిదని ఆ విభాగం ట్విట్టర్‌లో పేర్కొంది.