మయన్మార్‌లో సైన్యం కుట్రకు వ్యతిరేకంగా నిరసనలు

మయన్మార్‌లో సైన్యం కుట్రకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనల్లో పాల్గొంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. సైన్యానికి వ్యతిరేకంగా ప్రదర్శన కార్యక్రమాలు దేశమంతా విస్తరిస్తున్నాయి. 
 
సూకీని విడుదల చేయాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన వారికి అధికారాన్ని అప్పగించాలని ఆందోళనకారులు సైన్యాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం నేపిటాలో సూకీ తండ్రి ఆంగ్‌ సాన్‌ భారీ విగ్రహం వద్ద వేలాది మంది ఆందోళనకారులు నిరసన ప్రదర్శన చేశారు. వారిని చెదరగొట్టడానికి సైన్యం జలఫిరంగులను ఉపయోగించింది.
 
రాజ‌ధాని నైపితాలో నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు ర‌బ్బ‌ర్ బుల్లెట్లను ఫైర్ చేశారు.  ర్యాలీల‌పై ఆ దేశ సైన్యం బ్యాన్ విధించింది.   మ‌రోవైపు ఉద‌మ్య నేత ఆంగ్ సాన్ సూకీ ప్ర‌భుత్వానికి అంత‌ర్జాతీయంగా మ‌ద్ద‌తు పెరుగుతున్న‌ది.  ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, అందుకే ప్ర‌భుత్వ నేత‌ల‌ను నిర్బంధిస్తున్న‌ట్లు ఆ దేశ ఆర్మీ చెప్పింది.  రెండ‌వ అతిపెద్ద న‌గ‌ర‌మైన మండాలేలోనూ పోలీసులు టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించారు.  

ఆదివారం థాయ్‌లాండ్‌కు ఆనుకుని ఉన్న మయన్మార్ తూర్పు సరిహద్దులో మ్యావడ్డీ పట్టణంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీస్‌లు గాలి లోకి కాల్పులు జరిపారు. ఎవరికైనా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం లేకున్నా ఒక మహిళ కాల్పులకు గురైందని స్వతంత్ర నిఘా గ్రూపు వెల్లడించింది. అటు మిలిటరీ కానీ, ఇటు ఆందోళనకారులు కానీ వెనక్కు తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. 

ఆదివారం నాడు ఇంటర్‌నెట్‌పై నిషేధం స్వల్పంగా ఎత్తివేసిన తరువాత సూకీని తక్షణం విడుదల చేయాలని, ఆమె ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని అహింసాయుత నిరసనలు డిమాండ్ చేయడం ఎక్కువగా కనిపిస్తోంది.

దేశమంతా ఈ డిమాండ్‌తోనే ఆందోళనలు చెలరేగుతున్నాయి. సోమవారం నాడు తాజాగా తూర్పు షాన్ రాష్ట్రం సరిహద్దు నగరం తచిలెక్ లోను రాజధాని నేపిట్యా, మాండలే నగరంలోను ఆందోళనకారుల నిరసన ప్రదర్శనలు, మోటార్‌సైకిళ్ల ర్యాలీలు సాగాయి. నేపిట్యాలో అనేక రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. 

ఈ నగర జనాభాలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు. అయినా ఇక్కడ అసాధారణంగా ఆందోళనలు సాగుతుండడం విశేషం. యాంగూన్‌లో సోమవారం ఉదయం వేలాది మంది ఆందోళన సాగించారు.

మిలిటరీ తిరుగుబాటును తిరస్కరించాలి…మయన్మార్‌కు న్యాయం చేయాలి అని నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈనెల 1 నుంచి 165 మందిని నిర్బంధంలో ఉంచారని, వీరిలో కేవలం 13 మందినే విడుదల చేశారని స్వతంత్ర నిఘా సంస్థ అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (మయన్మార్) వెల్లడించింది.

సూకీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్న ఆస్ట్రేలియా మెక్వారీ యూనివర్శిటీకి చెందిన ఎకనామిస్ట్ సీన్ టర్నెల్ కూడా నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు దౌత్యమద్దతు కల్పిస్తామని, ఆయన తక్షణం విడుదల అవుతారని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరైస్ ప్యానే నమ్మకం వెలిబుచ్చారు.