అక్రమ చొరబాట్లను అరికట్టడంలో మమత విఫలం 

బంగ్లాదేశీ అక్రమ చొరబాట్లను అరికట్టడంలో మమత నేతృత్వంలోని బెంగాల్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ ఆరోపించింది. 2016 నుంచి 19 వరకు ఇండో- బంగ్లా సరిహద్దుల్లో దాదాపు 4,500 మంది అక్రమ చొరబాట్లను బీఎస్‌ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారని, తదుపరి చర్యల కోసం వారిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటించారు. 

రాజ్యసభలో ఈ విషయంపై ఎంపీ మానస్ రాజన్ భూనియా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. దాదాపు 4,189 మంది అక్రమ చొరబాట్లను బీఎస్‌ఎఫ్ జవాన్లు పట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,072 మందిపై మాత్రమే అరెస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు.
 
 1,134 మంది అక్రమ చొరబాటుదారులపై ఛార్జిషీట్ నమోదు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 212 మందిని మాత్రం అరెస్ట్ చేసిందని విమర్శించారు. అక్రమ చొరబాటుదార్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిత్యానంద రాయ్ ప్రభుత్వానికి సూచించారు.