పశ్చిమబెంగాల్ ప్రజలు తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వారి ముందు కమలం రూపంలో ఒక మార్గం ఉన్నదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. భవిష్యత్తులో కమలం పువ్వే బెంగాల్‌ను అభివృద్ధి మార్గంలో నడిపించనుందని చెప్పారు.
ఇటీవల ప్రధాని మోదీ బెంగాల్‌లో రిఫైనరీ ప్రాజెక్టు కోసం రూ.4,700 కోట్లు, రోడ్ల నిర్మాణం కోసం రూ.25,000 కోట్లు ప్రకటించారని నడ్డా గుర్తుచేశారు. అయితే, ఈ అభివృద్ధి పనులన్నీ జరుగాలంటే బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గద్దె దిగి, కమలం వికసించాలని స్పష్టం చేశారు.
రైతులకు, గిరిజనులకు మమత చేసిందేమీ లేదని నడ్డా విమర్శించారు. తాము అధికారికంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కమలమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రహదారులక కోసం 25 వేల కోట్ల రూపాయలను ఇటీవలే మోదీ ప్రభుత్వం మంజూరు చేసిందని, అలాగే ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికై 4700 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇవన్నీ కూడా బీజేపీ వస్తేనే సాధ్యమని, మమత గద్దె దిగితేనే బెంగాల్‌లో అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలిపారు.
తాము అధికారంకలోకి రాగానే ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ యోజన లాంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఓ వైపు ప్రధాని బెంగాల్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే, సీఎం మమత మాత్రం వాటిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
More Stories
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్