రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టు వ‌ల్లే ఈ ప్రళయం!  

చ‌మోలీలో కొండ చ‌రియ‌లు విరిగిన ప‌డిన ప్ర‌మాదానికి రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టు కార‌ణ‌మా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  2005లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచే మున్ముందు ముప్పు పొంచి ఉంద‌ని చమోలి ప్రాంత వాసుల్లోనూ,  భారీ విధ్వంసం జరుగుతుందనే భయం పర్యావరణవేత్తల్లో నెలకొంది. పర్యావరణానికి ఈ ప్ర‌మాద‌క‌రం, క‌నుక దీనిని నిలిపివేయాలంటూ చాలా మంది 2019 మేలో ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ ప్రాజెక్టు చేపడుతున్న ప్రైవేటు సంస్థ అటవీ ప్రాంతానికి గ‌ల‌ చారిత్రాత్మక మార్గాన్నీ కంపెనీ మూసేసిందని పేర్కొంటూ… గౌర దేవి అనే చిప్కో ఉద్యమ నేత  దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ఈ పిటిష‌న్‌పై స‌మాధానం చెప్పాలంటూ అప్ప‌ట్లోనే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉత్త‌రాఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింద‌ని అప్ప‌ట్లోనే వార్త‌లొచ్చాయి. 

స‌ద‌రు కంపెనీ ప‌నితీరు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్న‌ద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింద‌ని స‌మాచారం. 1970 తొలినాళ్ల‌లో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. 1974లో రెని గ్రామ‌ మహిళల బృందం వారి సంప్రదాయ అటవీ హక్కులను తిరిగి పొందటానికి చర్య తీసుకున్నప్పుడు ఈ ఉద్యమం జరిగింది.

రిషి గంగ న‌దీ ప్ర‌వాహం జోషిమ‌ఠ్‌-చ‌మోలీ మీదుగా దౌలి గంగ‌, అల‌క్‌నంద మీదుగా సాగుతుంది. అంతే కాదు కొండ‌లు, ప‌ర్వ‌తాలు, రాళ్ల మ‌ధ్య వెళుతూ ఉంటుంది. ప‌లు లేయ‌ర్ల‌పై సాగే న‌దీ ప్ర‌వాహంపై భారీ ప్రాజెక్టు నిర్మించ‌డానికి అస‌లు భూభాగ‌మే లేదు. అంతా కొండ‌లు, రాళ్ల మ‌యం. అందుకే ముప్పు పొంచి ఉందంటూ చ‌మోలీ గ్రామ‌స్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

హిమాల‌య రీజియ‌న్ ప‌రిధిలో వాతావరణ మాప్రు  జ‌రుగ‌డంతోనే మంచు చ‌రియ‌లు విరిగి ప‌డ్డాయ‌ని నిపుణులు అభావిస్తున్నారు. కాంక్రీట్ సిమెంట్ నిర్మాణాలు చేప‌ట్ట‌డం మ‌రో కార‌ణం. వాతావ‌ర‌ణంలో మార్పుల వ‌ల్ల స్నోపాల్‌, వ‌ర్షాలు ఎక్కువ అవుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  భార‌త్‌, భూటాన్‌, చైనా, నేపాల్ దేశాల మ‌ధ్య చిత్రించిన 40 ఏండ్ల శాటిలైట్ చిత్రాల‌ను నిపుణులు ప‌రిశీలించిన మీద‌ట గ్లోబ‌ల్ వార్మింగ్ వ‌ల్లే 1975-2000 మ‌ధ్య మంచు చ‌రియ‌లు క‌రుగ‌డం రెండు రెట్లు పెరిగింద‌ని చెప్పారు.