ప్రముఖ హీరో సూర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. తాను కరోనాతో బాధపడుతున్నానని, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నానని, మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదని తెలిపారు. అలాగని భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే కరోనా నుండి కోలుకునేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు.
ప్రస్తుతం ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 40వ సినిమాను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. షూటింగ్స్ నిమిత్తం బయటకు వచ్చినప్పుడు కరోనా సోకి వుండవచ్చని భావిస్తున్నారు.
కాగా, గత ఏడాది ఒటిటిలో విడుదలైన ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు. ఈ ఏడాది భారత్ తరపున ఆస్కార్‌కు ఎన్నికైన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం. ఎయిర్‌డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా సుధాకొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు