విస్తృత సంప్రదింపుల తర్వాతనే పెట్టుబడుల ఉపసంహరణ

పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకోవడానికి ముందు విస్తృత సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుందని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాల పట్ల చెలరేగిన  వివాదం నేపథ్యంలో ముంబైలో మాట్లాడుతూ  నచ్చినట్లు ఎంపిక చేసిన సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించే ప్రయత్నాలు చేయడం లేదని తెలిపారు. 

చెప్పారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత సైతం పెట్టుబడుల ఉపసంహరణ అంచెలంచెలుగా జరుగుతుందని చెప్పారు. ప్రతి దశలోనూ తనిఖీలు జరుగుతాయని భరోసా ఇచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ చాలా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, బహిరంగ ప్రక్రియ ద్వారా జరుగుతోందని పేర్కొన్నారు. 

రాష్ట్రాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నష్టపరిహారం గురించి మాట్లాడుతూ, జీఎస్‌టీ నష్టపరిహారం ఫార్ములాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రుణాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు.  ప్రతి సోమవారం తాను ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సమాచారాన్ని పరిశీలిస్తున్నానని చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సొమ్ము కేటాయించినదీ తెలుసుకుంటున్నానని తెలిపారు.