రామమందిరంకు కంచి మఠం రూ 6 కోట్ల విరాళం 

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కంచి మఠం ద్వారా రూ.6 కోట్లు విరాళంగా లభించింది. ఈ మొత్తాన్ని తమిళనాడు గవర్నర్‌ బన్వర్‌లాల్‌ పురోహిత్‌ చేతుల మీదుగా కంచి మఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అందజేశారు. 

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కంచి మఠంలో ప్రత్యేకంగా హుండీలను ఏర్పాటు చేశారు. తద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.6 కోట్లు విరాళాల రూపంలో వచ్చింది. 

ఈ సందర్భంగా  గవర్నర్‌ ప్రసంగిస్తూ, కంచి, అయోధ్యల మధ్య ఆధ్యాత్మికపరంగా సంబంధాలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నట్టు తెలిపారు. కంచి మఠం ఏ పనిచేసినా వంద శాతం విజయవంతం అవుతుందని, అయోధ్యలో రామాలయం వంద శాతం పూర్తి కావడం తథ్యమని భరోసా  వ్యక్తంచేశారు.