కరోనా సమయంలో తెలంగాణకు రూ.10,543.81 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. వివిధ పధకాల కింద ఈ మేరకు లబ్ధి చేకూరిందని వెల్లడించింది. కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని, వివిధ పథకాల కింద ఎంతమందిని ఆదుకుందని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.
తెలంగాణకు కరోనా ప్యాకేజీ కింద రూ.353.13 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద రూ.523.44 కోట్లు, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్(ఎస్ డీఆర్ఎఫ్) కింద రూ.449 కోట్లు, క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కింద రూ.179 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో పీఎంజీకేవై కింద 7, 24, 662 మెట్రిక్ టన్నుల ధాన్యం అందజేయగా, కోటి 80లక్షల 62వేల 980 మంది లబ్ధి పొందారని చెప్పారు. అలాగే 15,804 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను 52లక్షల 68వేల 30మందికి పంపిణీ చేశామని వివరించారు.

More Stories
ఆర్మీ భూముల్లోకి మళ్లీ ప్రవేశిస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు
`ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పోస్టర్ విడుదల
తెలంగాణకు బియ్యం సేకరణ 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు