దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించిన రాహుల్

దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించిన రాహుల్

దేశ ప్ర‌జ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యుద్ధం ప్ర‌క‌టించార‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌క‌పోతే, ఢిల్లీ, దాని స‌మీప ప్రాంతాల‌కు ప‌రిమిత‌మైన రైతు ఉద్య‌మం దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తుంద‌ని అంత‌కుముందు రాహుల్‌గాంధీ చేసిన హెచ్చ‌రిక‌ల‌పై స్మృతి ఇరానీ మండిప‌డ్డారు.

‘భార‌త ప్ర‌జ‌ల‌పై రాహుల్‌గాంధీ ఈ రోజు యుద్ధం ప్ర‌క‌టించారు. రాహుల్ గాంధీ త‌న రాజ‌కీయ వైఖ‌రి ప్ర‌కారం మ‌న‌దేశ ప్ర‌ధానికి స‌మ‌ర్థించ‌క‌పోతే న‌గ‌రాల‌న్నీ ద‌గ్ధ‌మ‌వుతాయి. రాహుల్‌గాంధీ పిలుపు దేశంలో హింస‌ను ప్రేరేపించ‌డానికేన‌ని ప్ర‌తి భార‌తీయ పౌరుడికి విజ్ఙ‌ప్తి చేస్తున్నాను’ అని ఆమె విఘ్న్పతి చ్చేసారు.

జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే నాడు జ‌రిగిన దాడులు దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి న‌గ‌రంలోనూ, మురికివాడ‌ల్లోకి విస్త‌రించాల‌ని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. దేశ స‌రిహ‌ద్దుల్లో రైతుల ఆందోళ‌న విర‌మించాలంటే, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను చెత్త‌బుట్ట‌లో వేయ‌డ‌మే ఒక్క‌టే ప‌రిష్కార మార్గం అని రాహుల్ గాంధీ అంతకు ముందు ట్వీట్ చేశారు.