పాకిస్థాన్ చట్టవిరుద్ధమైన ఉగ్రవాద సంస్థ లష్కర్ -ఇ-ఇస్లాం గ్రూప్ కమాండర్ మంగల్ బాగ్ ఆఫ్ఘనిస్థాన్ రోడ్డు పక్కన జరిగిన బాంబు పేలుడులో మరణించాడు. నంగర్ హార్ లోని ఆచిన్ జిల్లా బందర్ దారా ప్రాంతంలో పాక్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ మంగల్ బాగ్ తన ఇద్దరు సహచరులతో కలిసి వస్తుండగా పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో మంగల్ బాగ్ మరణించాడని గవర్నర్ జియా ఉల్ హక్ అమర్ ఖిల్ ట్వీట్ చేశారు. మంగల్ బాగ్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆఫ్ఘనిస్థాన్ దేశ సీనియర్ సలహాదారు జియా చెప్పారు. లష్కర్ -ఇ-ఇస్లాం తెహ్రిక్ -ఇ-తాలిబాన్ పాకిస్థాన్ కు అనుబంధంగా పనిచేస్తోంది.
2008 జూన్ నుంచి మంగల్ బాగ్ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు.గతంలో ఆఫ్ఘన్ దళాలు జరిపిన వైమానిక దాడిలో మంగల్ బాగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఖైబర్ ఏజెన్సీలోని బాగ్ ప్రాంతంలో జన్మించిన మంగల్ బాగ్ ఆఫ్రిది తెగ సభ్యుడు. ఇతను మదర్సాలో చదువుకొని ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించాడు.
More Stories
పెళ్లి కాని ప్రతి మహిళా బజారు సరుకు!
ప్రతీకార దాడులు తప్పువని ఇజ్రాయెల్కు ఇరాన్ హెచ్చరిక
ఫిజిక్స్లో ఇద్దరికి నోబెల్ పురస్కారం