హింసకు రెచ్చగొడుతున్ననేతల  వీడియోలు!

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో జరిగిన హింసతో దిగ్బ్రాంతికి గురైన దేశ ప్రజలు ఇంకా కోలుకోలేదు. అయితే ఇదంతా యాదృశ్చికంగా జరిగినది కాదని, ఒక పధకం ప్రకారం అరాజకం సృష్టించడం కోసం ప్రయత్నాలు జరిగాయని స్పష్టమైన ఆధారాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అయితే మొత్తం నేరాన్ని దీప్ సిద్దుపైకి నెట్టివేసి, అతనిని బీజేపీయే నిరసనకారుల మధ్యకు జొప్పించిందని ప్రచారం చేస్తూ,  తామంతా అమాయకులమనే విధంగా మాట్లాడుతున్నారు. 
 
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్న కొన్ని వీడియోలు దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. భారతీయ కిసాన్ యూనియన్ (బికేయు)కు చెందిన రాకేష్ టికాయత్, గుర్నామ్ సింగ్ చథుని, యద్విర్ సింగ్ వంటి ప్రముఖ నాయకులు ప్రదర్శకులను హింసకు పాల్పడమని రెచ్చగొడుతున్నట్లున్న వీడియోలు అనేకం ప్రచారంలోకి వస్తున్నాయి. 
 
తేదీ లేని ఒక వీడియోలో జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీని అనుమతిపక పోతే తీవ్ర పరిణామాలు ఏర్పడగలవని అంటూ కేంద్రాన్ని చథుని హెచ్చరిస్తున్నట్లు ఉంది. “ప్రభుత్వం గౌరవంగా మాకు అనుమతి ఇవ్వని పక్షంలో బ్యారికేడ్ లను పగలగొడతాం” అంటూ అందులో ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం లాటి ఛార్జ్ జరిపినా, కాలుకు దిగినా జనవరి 26న రాజధానిలో ప్రవేశించడానికి పూర్తిగా సిద్దమై రావాలని ఆయన ప్రదర్శకులకు పిలుపిచ్చారు. 
 
మరో వీడియోలో తమ వారు అసహనంగా ఉన్నారని యుద్దవీర్ సింగ్ తెలిపారు. వారు ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసారు. నాయకులు కేవలం ఒక దశ వరకు మాత్రమే వారిని నిలపగలరని అంటూ కూడా చెప్పారు. షహీన్ బాగ్ లో సిఐఐ వ్యతిరేక ప్రదర్శకులను ఖాళీ చేయించినట్లు రైతులను కూడా ఖాళీ చేయించగలమని అనుకుంటే అసాధ్యం కాగలదని హెచ్చరించారు. 
 
మరొక వీడియోలో ప్రదర్శకులను ఎర్రకోట వద్దకు వెళ్ళడానికి సిద్దమై రావాలని రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు. జెండాలు, కర్రలు, సాధనాలను తీసుకు వచ్చి తమ బలం చూపాలని కోరారు. 
 
“ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మీ జెండాలు, వాటికి కర్రలు మీరే తీసుకు రండి. మొత్తం పరిస్థితిని అర్ధం చేసుకోండి. మూడు రంగుల జెండాతో పాటు మీ జెండాను కూడా ఉంచండి. ఇప్పుడు అందరు రండి. మీ భూమిని వదలకండి. లేని పక్షంలో ఈ భూమి మీకు మిగలదు” అంటూ రెచ్చగొడుతూ ప్రసంగించారు. 
 
అయితే తాము కర్రలు తెమ్మన్నది జెండాలు ఎగరవేయడానికి గాని పోలీసులపై దాడులు జరపడం కోసం కాదని అంటూ ఇప్పుడు తికాయత్ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రైతు నాయకులపై నెటిజన్లు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు పధకం ప్రకారమే హింస, విధ్వంసాలను సృష్టించారని మండిపడుతున్నారు. 
 
ఎర్రకోటపై జాతీయ  పథకాన్ని తీసివేసి, కేసరి జెండాను ఎగురవేసి ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న  పంజాబీ నటుడు దీప్ సిద్ధుతో తమకు సంబంధం లేదని  వీరంతా యిప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవానికి గత కొన్ని నెలలుగా రైతుల ఆందోళనకు మద్దతుగా వారితో కలసి స్వరం వినిపిస్తున్నాడు. 
 
పధకం ప్రకారం ఎర్రకోటపై తమ జెండా ఎగురవేయాలని ప్రదర్శకులను రెచ్చగొడుతూ వచ్చిన రైతు నాయకులు ఇప్పుడు తమకేమి సంబంధం లేదని అంటూ, ఏదో ప్రచారం కోసం దీప్ సిద్దు చేసాడని అంటూ అతనిపై నెట్టివేసి ప్రయత్నం చేస్తున్నారు. 
 
ప్రజల దృష్టి మళ్లించడం కోసం సిద్దు వాస్తవానికి బిజెపి మద్దతుదారుడు అంటూ వామపక్ష తీవ్రవాదులు, కాంగ్రెస్ నేతలు, ఖలిస్థాన్ అనుకూలురు ఇప్పుడు విష ప్రచారం చేపట్టారు. గురుదాస్పూర్ బిజెపి ఎంపీ సన్నీ డియోల్ తో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, బిజెపి వారే విధ్వసం సృష్టించడం కోసం అతనిని రైతు ఉద్యమంలోకి జొప్పించారని ప్రచారం చేస్తున్నారు. 
 
వాస్తవానికి అతనికి సన్నీ డోయిల్ తో స్నేహం ఉండడంతో 2019 ఎన్నికలలో అతనికోసం ప్రచారం చేసాడు. బరఖా దత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను ఏ పార్టీకి సంబంధించినవాడిని కాదని, కేవలం స్నేహం కారణంగా సన్నీ డియోల్ కోసం ప్రచారం చేసానని, అయితే అందుకు ఆ తర్వాత చాల బాధపడ్డానని స్పష్టం చేసాడు. పైగా, ఖలిస్థాన్ ఉద్యమకారులను ఘనంగా పొగుడుతూ మాట్లాడాడు. అతనిచేత తాను బిజెపికి చెందిన వ్యక్తిని అని చెప్పించడం కోసం ఆమె విఫల ప్రయత్నం చేశారు. 
పంజాబ్ లో రైతులు ఆందోళన ప్రారంభించిన మొదట్లోనే దీప్ సిద్దు తాను కూడా ఒక రైతునే అంటూ వారికి మద్దతుగా తిరగడం కనిపించింది. పైగా ఈ ఉద్యమం భారత దేశ రాజకీయాలలోనే కాకుండా, దక్షిణ ఆసియా రాజకీయాలలో కీలక మార్పుకు దారితీస్తుందని అంటున్న అతని వీడియో ఒకటి అప్పట్లోనే వైరల్ గారింది. 
 
స్థానిక రైతుల సమస్యలపై జరుగుతున్న ఉద్యమం దక్షిణ ఆసియా రాజకీయాలపై ప్రభావం ఏ విధంగా చూపుతుందనే ప్రశ్నలు అప్పుడే తలెత్తాయి. అంటే రాజకీయ దురుద్దేశ్యంతో కొన్ని విద్రోహకార శక్తులు ఈ ఉద్యమాన్ని పక్కదారి పెట్ట్టించే ప్రయత్నాలు తొలి నుండే చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 
ఢిల్లీ వైపు బయలుదేరిన పంజాబ్ రైతులను ఆపివేస్తూ హర్యానా సరిహద్దులో నిలబడిన పోలీసులను దారి ఇవ్వమని సిద్దు హెచ్చరికలు చేస్తున్న వీడియోలు కూడా అప్పట్లో వచ్చాయి. అతను పక్కా ఖలిస్థాన్ ఉద్యమకారుడని పలువురు ఆరోపణలు కూడా చేశారు. 
 
ఈ మధ్యనే ఖలిస్థాన్ అనుకూల నినాదాలు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఒక న్యాయవాది హకం సింగ్ ను ఒక నిరసన ప్రదర్శన నుండి సిద్దు గెంటివేసాడు. ఖలిస్థాన్ అనుకూల సానుభూతిపరులకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఆ న్యాయవాదిని గెంటివేసినందుకు ఒక వీడియోలో కూడా పేర్కొన్నాడు. 
 
“ఖలిస్థాన్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారికి అనుకూలంగా నినాదాలు ఇచ్చినప్పుడు మనం వ్యతిరేకంగా స్పందించకూడదు. అందుకనే ఈ చర్య తీసుకోవలసి వచ్చింది” అంటూ తన చర్యను సమర్ధించుకున్నాడు. 
 
 
\