తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పింది. సకల జనుల సమ్మె తరహాలో నేటి నుంచి పోరుబాట పట్టాలని కార్మికులకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్‌షాపుల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది.
తమ న్యాయమైనఉక్కుపాదం హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం మోపుతున్నది. పోలీసుల పహారాలో బస్సుకు ఒక కానిస్టేబుల్‌ను పెట్టి బలవంతంగా బస్సులను నడుపాలని చూస్తున్నది. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు తెల్లవారుజాము నుంచే బస్సుల వద్దకు చేరి ఒక్క బస్సును కూడా కదలనీయలేదు.
పోలీసులు బలవంతంగా ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసినా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రజలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక ధరలు చెల్లించ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. మెదక్ ఆర్టీసీ డిపో నుంచి ఈరోజు తెల్లవారుజామున బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య బస్సులు నడిపేందుకు డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సులు తీసుకురాగా కార్మికులు సమాచారం తెలుసుకొని భారీ సంఖ్యలో చేరుకొని అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 తొమ్మిది డిపోల్లో 600 వందల బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్నది.
కామరెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల టెంట్‌ను పోలీసులు తొలగించడంతో వివాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నా చేపట్టారు. నల్లగొండ, సూ ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ర్యాపేట జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో బస్సులు నడుపాలని చూడగా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యను పరిష్కరించాల్సింది పోయి, సమ్మె పరిష్కారం కాదని నీతులు చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికే కమిటీల ఎత్తుగడలు వేస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యను పరిష్కరించాల్సింది పోయి, సమ్మె పరిష్కారం కాదని నీతులు చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికే కమిటీల ఎత్తుగడలు వేస్తోందని ధ్వజమెత్తారు.
ఉచిత బస్సు పథకానికి సంబంధించి వందల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా సంస్థను దివాలా తీయించే కుట్ర సర్కార్ చేస్తోందని ఆరోపించారు. ఆ
ర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో ఒక్క అడుగూ పడలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
More Stories
ప్రతిపక్షాల అనాలోచిత నిర్ణయంతోనే దక్షిణ రాష్ట్రాలకు తీరని నష్టం
నౌకల రవాణాకు ఇరాన్ కు చెల్లింపులు… భారత్ ఖండన
రేవంత్ పర్యటనలో ఎన్డిఎస్ఏ ఛైర్మన్… బండి సంజయ్ ఆగ్రహం