ఇళ్లు కట్టుకోవాలనుకునే వారందరికీ అండగా ఉంటా

ఇళ్లు కట్టుకోవాలనుకునే వారందరికీ అండగా ఉంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభయం ఇచ్చారు. ముషీరాబాద్ నాగమయ్య కుంటలో జరిగిన బీజేపీ బస్తీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ వరదలు వచ్చినపుడు ఈ బస్తీకి వచ్చా, మళ్లీ ఇప్పుడు ఇళ్లు ఇవ్వడానికి వచ్చానని తెలిపారు.
 
 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వ్యక్తిగతంగా ఇళ్ళు కట్టుకోవాలనుకునే వారికీ అండగా ఉంటానని, ముందుకు వచ్చే అందరికి లోన్లు  ఇప్పిస్తామన్నారు. మీ ఆదాయాన్ని, మీకున్న  స్థలాన్ని బట్టి హౌసింగ్ లోన్లు వస్తాయి..మీరు ఇళ్లు కట్టుకోవచ్చు అని సూచించారు. ఇక్కడ నాలా ప్రధాన సమస్యగా ఉంది, ఎవరూ కూడా నాలాలో చెత్త చెదారం వేయద్దుచ అవి జాం అవుతే మనకే సమస్య, ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి తగిన జాగ్రత్తలు అందరూ పాటించడం మంచిదన్నారు. 
 
మొన్న వచ్చిన వరదల్లో పట్టాలు పోయిన వారికీ తిరిగి కొత్త పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తానని, స్వచ్ఛ భారత్ కు అందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. వాక్సిన్ వేసుకున్న వారు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏడాది పాటు కష్టపడి వాక్సిన్ తయారు చేశారు, ప్రపంచంలో 4 కంపెనీలు వాక్సిన్ తయారు చేస్తే అందులో రెండు కంపెనీలు మన దేశానివే కావడం గర్వకారణమన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్  యోజన  కింద స్వంత ఇళ్లు కట్టించడానికి  సిద్ధంగా ఉన్నామని, అర్హులు అయిన అందరికి ఇళ్లు వస్తాయని ఓబీసీ మోర్చా బీజేపీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఇక్కడ హై టెన్షన్ వైర్ ప్రధాన సమస్య గా ఉందని, గత 30 ఏండ్లుగా పోరాడామని.. ఇపుడు ఆ సమస్య లేదన్నారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బస్తీని దత్తత  తీసుకుంటామన్నారు, ఈ బస్తీని గతంలోఎమ్మెల్యే గా ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేసుకున్నారు. బస్తీలో డ్రైనేజి, రోడ్లు సమస్యలు పూర్తిగా పరిస్కారం అయ్యాయి.. ఇప్పుడు కిషన్ రెడ్డి చొరవతో త్వరలోనే ఇళ్ల సమస్య కూడా తీరుతుందన్నారు. స్వంతంగా ఇళ్ళు కట్టుకోవాలనుకునే  వారికి కేంద్రం తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తుందని, ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఎన్నో ఇళ్ళు కట్టిస్తున్నాడు…మన రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద చూపెట్టట్లేదని ఆయన విమర్శించారు.