‘‘మనం ఒకర్నొకరం ప్రత్యర్థులుగా కాకుండా, పొరుగువారిగా చూసుకుందాం. ఒకర్నొకరం గౌరవించుకుంటూ హుందాగా మసలుదాం. విద్వేషాలొద్దు… ఐక్యత లేనిదే ప్రశాంతత లేదు. ఇది నిజం. దీన్ని సాధించిననాడు మనం విఫలం కాబోము. కలిసికట్టుగా ఉన్నన్నాళ్లూ ఎన్నడూ అమెరికా విఫలం కాలేదు” అంటూ సందేశం ఇచ్చారు.
“ఫలానాది సాధ్యం కాదనో, పరిస్థితులు మారవనో నాకు చెప్పొద్దు. ఓ మహిళ దేశ ఉపాద్యక్షురాలైంది. ఇది చరిత్ర’’ అని బైడెన్ ఉద్ఘాటించారు. ‘‘భవిష్యత్ గురించి చాలా మంది ప్రజల్లో బెంగ, భయాలు ఉన్నాయి. ఉద్యోగం ఉంటుందా, పన్నులెలా కట్టాలి, కుటుంబాన్నెలా పోషించాలి… ఇలా! రేపేం జరుగుతుందోనన్న ఆందోళన అనేకమందిని వెన్నాడుతోంది. భయపడవద్దు.. మీలో మీరు కుమిలిపోకండి. పోటీపడండి. మిమ్మల్ని నమ్మని వారిని దూరం పెట్టండి’ అని ఆయన భరోసానిచ్చారు.
‘ఈ అనాగరిక, అమర్యాదపూర్వక యుద్ధానికి చరమగీతం పాడాలి. మన ఆత్మలను, హృదయాలను తెరిచి, సామరస్యానికి తావిస్తే ఇది సాధ్యమే. ఇతరుల కోణంలో నుంచి కూడా చూడాలి’ అని ఆయన హితవు పలికారు. ‘‘ఈ ఆపత్సమయంలో ఒకరికొకరి సాయం కావాలి. శతాబ్దిలో ఒకసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనడానికి కలిసిరండి. ప్రాణాంతకమైన ఈ శీతాకాలాన్ని మనం దాటేయాలి. రాజకీయాల్ని పక్కనపెట్టి దేశమంతా ఒకే తీరుగా కదలాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
‘‘విజృంభించిన మహమ్మారి, ప్రజాస్వామ్యంపై దాడి, పర్యావరణ సంక్షోభం, వర్ణవివక్ష, అసమానతలు… ఇవన్నీ విడివిడిగా కాదు, అన్ని సంక్షోభాలూ ఒక్కసారే వచ్చిపడ్డాయి.. ధైర్యంగా ఎదుర్కొందాం’’ అని ఆయన కోరారు.
బైడెన్ కంటే 20 నిమిషాల ముందు.. దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ (56) ప్రమాణస్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్-ఆమెరికన్‌గా, దక్షిణాసియా మూలాలున్న వ్యక్తిగా, భారతీయ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 15 కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకాలు చేయనున్నట్టు శ్వేతసౌధ అధికారులు తెలిపారు. ట్రంప్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను ఉపసంహరించనున్నట్టు చెప్పారు.
వలస విధానంపై సమగ్ర బిల్లును కాంగ్రెస్ ఆమోదానికి బైడెన్ తొలిరోజే పంపనున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఇందులో ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులపై దేశాలవారీ కోటాను కూడా ఎత్తివేయనున్నారు. దీనితో వేలాది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది.
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?