పాల్ దినకరన్‌ సంస్థలపై ఐటిశాఖ సోదాలు   

జీసస్‌ కాల్స్‌ సంస్థ అధ్యక్షుడు, పాస్టర్‌ పాల్ దినకరన్‌ కు సంబంధించిన ప్రదేశాలపై పలు ప్రాంతాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు   బుధవారం సోదాలు చేపట్టారు.  చెన్నై, కోయంబత్తూర్‌లోని జీసస్‌ కాల్స్‌ గ్రూప్‌కు చెందిన 28 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తోంది.

కోయంబత్తూర్‌లోని కారుణ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యా సంస్థలో కూడా సోదాలు జరిపింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు పాల్‌ దినకరన్‌ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. జీసస్‌ కాల్స్‌ తన వెబ్‌సైట్‌లో వివిధ పథకాల కింద భారీ ఎత్తున సేకరిస్తున్న విదేశీ విరాళలో అక్రమాలకు, పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈ సోదాలు జరిపిన్నట్లు  సంబంధిత వర్గాలు తెలిపాయి.  

క్రైస్తవ ప్రచారకుడు డిజిఎస్ దినకరన్ కుమారుడైన పాల్ దినకర్ తమిళనాడులు పలు సంస్థలను నిర్వహిస్తున్నారు. ఆయనకు తమిళ్ క్రైస్తవులలో మంచి అనుచరవర్గం ఉంది. 

జీసస్ కాల్స్ వెబ్ సైట్ ప్రకారం జీసస్ కాల్స్ టివి ప్రతి నెలా 400 కార్యక్రమాలను 10 భాషలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. క్రైస్ట్ పై నమ్మకంతో ప్రార్ధనలు చేయడం ద్వారా తమ ఇబ్బందులను అధిగమించిన వారి కథనాలను ప్రచారం చేస్తుంది. 1986లో ఏర్పాటు చేసిన కారుణ్య ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో 8000 మంది విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్,  మీడియా, మానేజ్మెంట్ కోర్స్ లను చదువుతున్నారు.