హిందీ భాషా కోర్సులను తొలగించేందుకు దక్షిణ కొరియా లోని బూసాన్ యూనివర్శిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ యూనివర్శిటీఅధికారులు నిర్ణయించడంపై అక్కడి విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందీ భాషా అధ్యయనానికి సంబంధించిన కోర్సును తొలగించద్దొంటూ సోషల్ మీడియా వేదికగా నిరసనలు తెలుపుతున్నారు.
పైగా, ఈ విషయమై సియోల్‌లోని భారత్ ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశారు. దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్శిటీ, హాన్‌కుక్ యూనివర్శిటీలు మాత్రమే హిందీ భాష అధ్యయనానికి అవకాశం కల్పిస్తున్నాయి. బూసాన్ విశ్వవిద్యాలయంలో 1983లో హిందీ భాష కోసం ఇండియన్ స్టడీస్ విభాగం ఏర్పాటవగా.. 1972 నుంచే హాన్‌కుక్ యూనివర్శిటీలో హీందీ భాషపై ప్రత్యేక కోర్సులు ఉనికిలో ఉన్నాయి.
కాగా కొద్ది వారాల క్రితం ఇంహీందీ భాషకు సంబంధించిన కోర్సులకు ముగింపు పలికే యోచనలో యూనివర్శిటీ ఉందని ప్రకటించారు. భారత్‌లో పనిచేయాలనుకునే దక్షిణకొరియా వారికి ఇంగ్లీష్ వస్తే సరిపోతుందని కూడా పేర్కొంది.
భారత దేశంలో హిందీ భాషకన్నా ఇంగ్లీష్ భాష ఎక్కువగా ఉపయోగంలో ఉన్నదనే అభిప్రాయంతో, హిందీ బదులు ఇంగ్లీష్ కోర్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రకటనతో హిందీ భాషా కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. దీంతో వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తమ నిరసల తెలుపుతున్నారు. ఈ విషయమై లీ జున్‌హాక్ అనే వ్యక్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హీందీ భాష అధ్యయనం ద్వారా భారత్‌లోని మారుమూల ప్రాంతాలను కూడా చేరుకుని అక్కడి సంస్కృతులను అధ్యయం చేయచ్చని తెలిపాడు.
మరోవైపు హీందీ భాషపై ఆసక్తిగల విద్యార్థులు సియోల్‌లోని భారత ఎంబసీకి, ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలకు కృషి చేసే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌కు ఈ విషయమై నేరుగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన ఆవేదన తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. ప్రధాని జోక్యం చేసుకొని హిందీ కోర్స్ కొనసాగేటట్లు చేయాలని అభ్యర్ధించారు.
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?