దేశీయ ఉత్పత్తులకు వరప్రసాదం ఆత్మనిర్భర్ భారత్ 

అమితాబ్ కాంత్, సిఇఓ, నీతి ఆయోగ్

కోవిడ్ -19 మహమ్మారితో ప్రపంచం కకాలవికాలం కావడంతో  2020 సంవత్సరం సాధారణం నుండి తీవ్రంగా నిష్క్రమించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రాణాలను, జీవనోపాధిని రక్షించే సవాలు చాలా కష్టమైంది. చైనా వెలుపల అత్యధిక జనాభా మన వద్ద ఉన్నందున   మందిచాలా  నిపుణులు భారతదేశానికి ఇది అధ్వాన్నమన సంవత్సరంగా పేర్కొన్నారు.

పది నెలల తరువాత, అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలలో అతి తక్కువ మందికి వైరస్ సోకి, తక్కువ మంది మృతి చెందిన దేశంగా భారత్ నిలబడింది.  అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తూనే ఉన్నప్పటికీ, మనం మొదటి లక్ష్యాన్ని సాధించాము. లాక్ డౌన్ లు ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించి ఎగుమతి మార్కెట్లను కదిలించడంతో ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం రెండవ సమస్య. ఇది అన్ని దేశాలకు  తికమక పెట్టే సమస్య.

ఇక్కడే భారత ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని తలక్రిందులుగా చేసుకుని, ప్రతిష్టాత్మక విధాన నమూనాను ప్రారంభించడం ద్వారా దీనిని అవకాశంగా మార్చింది – అదే అత్మీనిర్భర్ భారత్ అభియాన్, ఇది ఇతరులపై ఆధారపడటం  నుండి స్వావలంబన వైపుకు వెళ్లడం, తయారీ,  ఎగుమతి-ఆధారిత పెరుగుదల. ఇది రక్షణ వాదాన్ని సూచిస్తుందనే వాదనలకు విరుద్ధంగా,  ఇది అనుకూల పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడం. ఇది మన సంస్థలను ప్రపంచ వేదికపై అధిక పోటీనిచ్చేలా చేస్తుంది.

ఇక్కడ, ప్రపంచ అనుభవాలు మనకు మార్గనిర్దేశం చేయాలి.  జపాన్ తన ఆటో పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించే విధాన వాతావరణాన్ని సృష్టించింది.  దక్షిణ కొరియా వినియోగదారుల మన్నిక కోసం అదే చేసింది. టయోటా, శామ్‌సంగ్, ఎల్‌జీ ఇప్పుడు సర్వత్రా  ఇంటి పేర్లుగా మారాయి.

ఏ దేశమూ తన ఆర్థిక వ్యవస్థ మౌలిక సంస్కరణల  ద్వారా ఉత్పాదక రంగాన్ని వృద్ధి చేయకుండా దూసుకు వెళ్ళలేదు. ఐరోపా 17-18 వ శతాబ్దంలో అదే విధంగా చేసింది. 19 వ శతాబ్దం చివరి నుండిఅమెరికా అదే సాధించింది.  తూర్పు ఆసియాలోని పలు  ఆర్థిక వ్యవస్థలు 1950-80ల వరకు సాధించాయి. గత మూడు దశాబ్దాలుగా చైనా అటువంటి సంస్కరణల ద్వారానే వేగంగా వృద్ధి సాధిస్తున్నది.

1960-90 మధ్య కాలంలో, దక్షిణ కొరియా సగటున 9.6% చొప్పున పెరిగింది. అదేవిధంగా, 1980 – 2010 మధ్య చైనా సగటు 10% వృద్ధిని సాధించింది. అయితే, గత 30 సంవత్సరాలుగా భారతదేశం సగటున 6.5% వృద్ధిని మాత్రమే సాధింప గలుగుతున్నది. ఈ లక్ష్య సాధనకు  కార్మిక- కేంద్రీకృత  పరిశ్రమలలో పోటీగా ఉండటానికి, వ్యవసాయం నుండి బయటపడే ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి, మన ఉత్పాదకత,   జీవన నాణ్యతను పెంచడానికి వీలు కల్పించే అనుకూలమైన దేశీయ ఆర్థిక వ్యవస్థను సృష్టించడం అవసరం కాగలదు.

జపాన్, చైనా, దక్షిణ కొరియా, గతంలో, వేగంగా అభివృద్ధి చెందాయి.  నిరంతర అధిక వృద్ధి రేటును సాధించాయి, ఎందుకంటే వారు సంక్షోభాన్ని అవకాశంగా ఉపయోగించుకోగలిగారు. వృద్ధి యొక్క సూర్యోదయ ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశంగా మార్చారు. ఆత్మనిర్భర్ భారత్ కింద, మనం 10 రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాల (పిఎల్ఐ) పథకాన్ని ప్రకటించాము, ఈ రంగాలలో  భారతదేశం పోటీ సామర్ధ్యం పెంచుకోవడం ద్వారా అభివృద్ధి సాధించగలం. అదే సమయంలో ఎగుమతి మార్కెట్లో సింహభాగాన్ని కైవసం చేసుకోగలం.

ఈ సూర్యోదయ రంగాలు ఆటోమొబైల్స్ , ఆటో కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్, స్పెషాలిటీ స్టీల్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ ప్రొడక్ట్స్, వైట్ గూడ్స్ (ఎసి,  ఎల్‌ఇడి), ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, అధిక సామర్థ్యం గల సోలార్ పివి మాడ్యూల్స్, అధునాతన బ్యాటరీ కణాలు.

2020 ప్రారంభంలో ఈ సంవత్సరం మొదట్లోనే పీఎల్ఐ  ప్రకటించిన మూడు రంగాలకు ఇవి అదనం కాగలవు. అవి వైద్య పరికరాలు, మొబైల్ ఫోన్లు,  ఎపిఐ లు. పిఎల్‌ఐ పథకం ప్రోత్సాహకాలకు మద్దతు ఇవ్వడానికి బదులు ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. అందుకనే 26 బిలియన్ల బడ్జెట్ కేటాయింపులు 520 బిలియన్ డాలర్ల ఉత్పత్తి సామర్థ్యంగా మారగలవు.

అంటే  ఇది భారతదేశ దేశీయ ఆర్థిక వ్యవస్థలో  కనిపించని సామర్ధ్యాన్ని అందించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో మన ఎదుగుదలకు దోహదపడగలదు. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ప్రారంభ (స్టార్స్ అప్) పర్యావరణ వ్యవస్థ అయిన భారత  దేశంలో ఇటువంటి విధాన పరమైన చర్య ప్రభావం అసమానమైనవి కాగలదు. 50 సంవత్సరాల కష్టతరమైన ప్రయాణం తరువాత, మనం ప్రైవేటు రంగ భాగస్వామ్యం కోసం మైనింగ్ రంగాన్ని తెరిచాము. బొగ్గుపై గుత్తాధిపత్యం రద్దు చేసాము.

ఎంఎస్ఎంఇ నిర్వచనం మార్చడం ద్వారా వారు ప్రభుత్వం నుండి మద్దతును కోల్పోకుండా తమ స్థాయిని పెంచుకొనే అవకాశం కల్పిస్తున్నాము.  కార్మిక చట్టాలను హేతుబద్ధం కావించాము. వాటిని 4 కోడ్‌లుగా క్రోడీకరించాము. తద్వారా  స్థిర-కాల ఉపాధిని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ రంగంలో స్థిరమైన నిధులతో పాటు సంస్కరణలు తీసుకు రావడం   మౌలిక సదుపాయాలను కల్పించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, మన రైతులు నేరుగా ప్రైవేట్ వ్యాపారాలు – ఎగుమతి మార్కెట్లకు విక్రయించడానికి వీలు కల్పిస్తుంది.

జీఎస్టీ, కార్పొరేట్ పన్ను రేటు హేతుబద్ధీకరణ, ఆధునిక దివాలా చట్టం, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, ఎఫ్‌డిఐ పాలనను సరిదిద్దడం,  రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) వంటి కఠినమైన సంస్కరణలపై ఈ ప్రతిష్టాత్మక పధకం నిర్మించడంతో విశేషమైన ఫలితాలు అనివార్యం కాగలవు.

ఈ సంస్కరణలు ప్రపంచానికి బలమైన,  సానుకూల సంకేతాన్ని పంపాయి. మనం వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నామని,  ప్రపంచ మార్కెట్లతో లోతైన సంబంధాలను ఏర్పరచాలనుకుంటున్నామనే సంకేతాన్ని పంపాయి. 2020 లో కూడా, ఎఫ్‌డిఐల ప్రవాహం 11 శాతం  పెరిగి 42.06 బిలియన్ డాలర్ల నుండి 46.82 బిలియన్ డాలర్లకు పెరిగింది.

భారత దేశం వలే కేవలం కొన్ని దేశాలకు మాత్రమే సహజ వనరులతో పాటు, మానవ వనరులు పుష్కలంగా నెలకొంటాయి. ప్రపంచంలో భారత్ విశేషమైన ప్రయాణం చేయడానికి ఈ వనరులు విశేషంగా ఉపయోగపడతాయి.  ఆత్మనిర్భర్ భారత్ ఇప్పటికే ఫలితాలను చూపించడం ప్రారంభించింది. కరోనా మహమ్మారి మనలను తాకినప్పుడు, మనం  పిపిఇ కిట్లు లేదా వెంటిలేటర్లను ఉత్పత్తి చేయలేదు. ఈ రోజు, మనం వాటిని ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాము.

ఇది మన దేశంలో సానుకూల పర్యావరణ వ్యవస్థను ఏర్పర్చడంతో పాటు వ్యయ పోటీతత్వాన్ని సులభతరం చేస్తుంది. మన దేశంలోని ప్రైవేట్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి, పోటీ పడడానికి అవకాశం కల్పిస్తుంది. అభివృద్ధిలో అంతరాయం అనివార్యం కావడంతో నాణ్యత, శ్రేష్ఠత, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించడం  చాలా అవసరం. కోవిద్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భారత్ ఏ విధమైన కీలక పాత్ర పోషింపనున్నదో అనడానికి టీకా అభివృద్ధిలో మన విశేషమైన పురోగతి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.