అరకొర సిబ్బందితో హెచ్ఎండీఏ 

గత 18 ఏళ్లుగా ఉద్యోగ నీయమకాలు లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)  తగినంత సిబ్బంది లేకుండానే పని చేయవలసి వస్తున్నది. వదల కొద్దీ కొత్త పోస్టుల అవసరం ఉన్నా ఉన్న ఖాళీలనే భర్తీ చేయడం లేదు. దానితో ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైననే పని భారం పడుతున్నది. 
 
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించవలసిన హెచ్ఎండీఏ తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నది.  పెద్ద ఎత్తున లే అవుట్లు, వందల ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు, సిటీ నలువైపులా కొత్త టౌన్ షిప్పులను పట్టాలెక్కించే పని హెచ్ఎండీఏదే.  ఓఆర్ఆర్​ను  నందనవనం తరహాలో తీర్చిదిద్దే బాధ్యత దీనిపైనే ఉంది.
 
అసలు హెచ్ఎండీఏ కు చాలా రోజుల నుంచి పూర్తి స్థాయి కమిషనరే లేడు. ఇన్ చార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో ఏ పని కావాలన్నా తీవ్రంగా జాప్యం జరుగుతోంది. కమిషనర్ రెగ్యులర్ గా రావడం కుదరకపోవడంతో చాలా పనులు పెండింగ్ పడుతున్నాయి. 
 
190 మందే రెగ్యులర్​ఉద్యోగులు ఉండగా, మిగతా వారంతా డిప్యూటేషన్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందే ఉన్నారు. హెచ్ఎండీఏలో డిప్యూటేషన్ ఉద్యోగులదే హవా నడుస్తుందని రెగ్యులర్ ఉద్యోగులు చెబుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే చాలా పోస్టులు ఖాళీగా లేకపోతే ఇన్ చార్జిలు డిప్యూటేషన్లతో నింపేశారు.
 
 హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధి పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది.  అందుకు తగిన విధంగా ఉద్యోగులను మాత్రం నియమిస్తలేరు. దీంతో ఆశించిన వేగంగా అభివృద్ధి పనులు పూర్తి​ కావడం లేదు. బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం, బాటసింగారం, మంగళపల్లి లాజిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కులు, లేక్ ప్రొటెక్షన్ లో భాగంగా చెరువుల అభివృద్ధి, గండిపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హుస్సేన్ సాగర్ అభివృద్ధి, లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యూ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కులు, కోకాపేట్ వెంచర్ అభివృద్ధి  వంటి చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి.
 
ఈ పనులను ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షిస్తుండగా, ఇక్కడ 50 కి పైగా ఖాళీలు ఉన్నాయి.  గ్రేటర్ పరిధి విస్తరించడంతో నగర శివారుల్లోనూ భారీగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. వీటి పర్యవేక్షణకు సరిపడా సిబ్బంది లేరు. ఆన్ లైన్ విధానంలోనే ప్రక్రియ కొనసాగుతున్నా  ఫైల్ క్లియరెన్స్ కు మాత్రం ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిందే.
 
హెచ్ఎండీఏ లో 2003లో అప్పటి ప్రభుత్వం 600 పోస్టులను మంజూరు చేసింది. కానీ అప్పుడు హుడాగా ఉన్న పరిధిని హెచ్ఎండీఏ గా మార్చారు. దాదాపు ఏడు జిల్లాలకు ఇది విస్తరించింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో చాలా పెద్ద ప్రాజెక్టులు మొదలయ్యాయి. దీనికి తోడు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి అనుమతులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండీఏ పరిధి ఎంతగా విస్తరించినప్పటికీ అదే స్థాయిలో ఉద్యోగులను మాత్రం పెంచడం లేరు.