ఇబ్బంది పెట్టకండి … అభిమానులతో రజనీకాంత్ 

ఇబ్బంది పెట్టకండి … అభిమానులతో రజనీకాంత్ 
తనను రాజకీయాలలోకి రమ్మనమని తనను ఇబ్బంది పెట్టవద్దని తమిళ్ సూపర్ స్టార్ తన అభిమానులను అభ్యర్ధించారు. తాను రాజకీయాలలోకి రాబోనని మరోమారు స్పష్టం చేశారు. 

తన నిర్ణయాన్ని తాను ఇది వరకే వివరించానని చెప్పిన తలైవా  దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దంటూ కోరారు. రజినీకాంత్ తన విజ్ఞప్తిని లేఖ రూపంలో ట్విట్టర్‌ ద్వారా సోమవారం విడుదల చేశారు‌.తాను రాజ‌కీయాల్లోకి రాబోన‌ని, ఆ విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు ఉండ‌బోద‌ని ర‌జినీకాంత్ స్ప‌ష్టంచేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తానని రజినీకాంత్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. దీంతో తలైవా రాజకీయాలలో ప్రవేశిస్తారని  భావించిన అభిమానులకు నిరాశ కలిగింది. అనారోగ్యం కారణంగా తాను రాజకీయాల్లోకి రాలేనని రజినీకాంత్ స్పష్టం చేశారు.

అయితే రజినీకాంత్‌ అభిమానులు ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. తలైవా తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కొందరు, రజనీ మక్కళ్‌ మండ్రం బాద్యతల నుంచి, మండ్రం నుంచి తొలగించబడిన పలువురితో కలిసి చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆందోళన కూడా చేశారు. 

ఈ ఆందోళనపై స్పందించిన రజినీకాంత్ తాజా ప్రకటనతో స్పష్టత  ఇచ్చారు.తాను తీసుకోవాల్సిన నిర్ణ‌యం ఇప్ప‌టికే తీసుకున్నాన‌ని, ఇక ఆ నిర్ణ‌యాన్ని మార్చుకునే ఆలోచ‌న లేద‌ని తెలిపారు.

 ‘నేను ప్ర‌తి ఒక్కరికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. నేనంటే గిట్ట‌ని వాళ్లు చేసే ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ద‌య‌చేసి పాలుపంచు‌కోకండి’ అని త‌న‌ అభిమానుల‌ను ఉద్దేశించి ర‌జినీకాంత్ వ్యాఖ్యానించారు. అలాంటి ఘ‌ట‌న‌లు త‌నను బాధిస్తాయ‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.