
రెచ్చగొట్టేవిధంగా ట్వీట్లు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా మూసి వేయడం ప్రజాస్వామ్య దేశాలకు ఓ హెచ్చరిక వంటిదని బీజేపీ ఎంపీ, యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడి అకౌంట్‌నే బ్యాన్ చేసినప్పుడు మనలాంటి వాళ్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. బడా టెక్నాలజీ కంపెనీలు ప్రభుత్వ నియంత్రణలో లేకుంటే ఇలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ట్విట్టర్లో స్పందించిన అయిన తేజస్వి సూర్య టెక్నాలజీ కంపెనీ చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు.
భారత్ పై అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ఈ సమీక్ష అవసరం కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలను బ్యాన్ చేయవద్దు అని, ఇదే తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు ఓ ట్వీట్లో ఎంపీ సూర్య పేర్కొన్నారు. ఎటువంటి జవాబుదారీతనం లేకుండా నా అకౌంట్‌ను సీజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తాను అని ఎంపీ తన ట్వీట్లో వెల్లడించారు.
అయితే భారత్‌లో ఎమర్జెన్సీ విధించిన ఓ పార్టీ నుంచి ఇటువంటి అభిప్రాయాలు వెలుబడవు అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో తాను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మరో ట్వీట్లో ఓ వీడియోను పోస్టు చేశారాయన. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో జోక్యం చేసుకునే అవకాశం టెక్నాలజీ కంపెనీలకు ఇవ్వకూడదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
More Stories
దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలి
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
నేడు ఏపీ సిఐడి కస్టడీకి చంద్రబాబు నాయుడు