ఎట్టకేలకు ఫార్మా రంగంలో భారత్ ప్రతిభా పాటవాలను చైనా అంగీకరించింది. కరోనా టీకాల కోసం ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తున్న తరుణంలో భారత్‌లో టీకా తయారీ గురించి చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. టీకాలపై పరిశోధన, ఉత్పత్తి విషయంలో భారత్ చైనాకు ఏమాత్రం తీసిపోదంటూ భారత్ సామర్థ్యాన్ని పరోక్షంగా అంగీకరించింది. అంతేకాకుండా టీకాల ఎగుమతులకు భారత్ అంగీకరించడం ప్రపంచానికి ఓ శుభవార్త అని కూడా పేర్కొంది.
అయితే నరనరాల్లో భారత్ వ్యతిరేకత నింపుకున్న చైనా టీకాల ఎగుమతి విషయంలోనూ భారత్‌కు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేసింది. టీకా ఎగుమతులకు అనుమతించడం వెనుక భారత ప్రభుత్వం రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తోందని ప్రచురించింది. తన పరపతిని పెంచుకుంటూ చైనా టీకాలకు పోటీ రావడమే భారత్ అసలు లక్ష్యమంటూ తన అసూయను వెళ్లగక్కింది.
చైనా టీకాల సామర్థ్యం, అక్కడి ప్రభుత్వం పాటిస్తున్న అనవసర గోప్యతపై సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో భారత్ టీకాల పట్ల చైనా అక్కసు వెళ్లగక్కడం గమనిస్తే అంతర్జాతీయంగా భారత్ కారణంగా తాము ఆత్మరక్షణలో పడవలసి వస్తుందనే భయం చైనా ధోరణిలో కనిపిస్తున్నది.
‘
మరోవైపు ధనిక దేశాలన్నీ తమ ఇళ్లు చక్కబెట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తుండటంతో పేద, మధ్యఆదాయ దేశాలు కరోనా టీకాల కోసం అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు బ్రెజిల్ నుంచి ఇటు నేపాల్ దాకా మాకు టీకాలు కావాలంటూ భారత్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రెజిల్ అధ్యక్షుడు తాజాగా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు కూడా.
ప్రపంచానికి కావాల్సిన టీకాల్లో 60 శాతం భారత్‌లోనే తయారవుతాయన్న బీబీసీ నివేదికను కూడా గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. గత ఏడాది భారత్ బయోటెక్‌ను సందర్శించిన చైనా ప్రొఫెసర్ జియాంగ్ చున్‌లాయ్ అభిప్రాయాలను కూడా తన కథనంలో ప్రస్తావించింది. టీకాల అభివృద్ధి, తయారీ విషయంలో భారత్ ప్రతిభాపాటవాలకు జియాంగ్ ముగ్ధుడయ్యారు.
‘ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీ దారు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లో ఉంది. భారత్ టీకా తయారీ సామర్థ్యం పాశ్చాత్య దేశాలతో సమానం. కరోనా టీకా ఉత్పత్తికై భారత్ చాలా ముందుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీఏవీఐ వంటి అంతర్జాతీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.
పైగా, టీకా తయారీలో భారత్ పాశ్చాత్య ప్రామాణాలు పాటించడం కూడా ఎగుమతులు పెరిగేందుకు తొడ్పడ్డాయి. జెనెరిక్ మందుల అంటే భారత్ పేరే ముందుగా గుర్తొచ్చినప్పటికీ, టీకా పరిశోధనల విషయంలో భారత్ చైనాకేం తీసిపోదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు..టీకాల ఎగుమతుల విషయంలో భారత్ తన తొలి ప్రాధాన్యాన్ని పొరుగు దైశాలైన బాంగ్లాదేశ్, నేపాల్‌కే ఇవ్వనుంది. దేశీయవసరాలకు తగినన్ని సిద్ధం చేసుకున్నాక పొరుగు దేశాలతో పాటూ ఇతరులకు టీకాను సరఫరా చేయనుంది. హైడ్రాక్సీ క్లోరిన్ ఎగుమతుల విషయంలోనూ భారత్ ఇదే వైఖరి అవలంబించింది.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
కెనడాలో వెయిటర్ ఉద్యోగాలకై వేల మంది భారతీయుల క్యూ