సంగీతం ప్రేరేపించే భావోద్రేకాల గుర్తింపు 

సంగీతం ప్రేరేపించే భావోద్రేకాల గుర్తింపు 
సంగీతానికి భావోద్వేగ ప్రతిస్పందనలకు ఏరకమైన న్యూరల్‌ మెకానిజమ్స్‌ స్పందిస్తాయనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా సంగీతం ద్వారా 102 న్యూరల్‌ మెకానిజమ్స్‌ స్పందిస్తాయని కనుగొన్నారు.
 
అసలు సంగీతం వినేటప్పుడు శరీరంలో ఉన్న న్యూరల్‌ మెకానిజమ్‌ ఫంక్షనింగ్‌ ఎలా ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనాన్ని ఫిన్లాండులోని టుర్కు పట్టణంలో ఉన్న జాతీయ పీఈటీ సెంటర్‌లో నిర్వహించారు.
 
మాములు సంగీతం వింటున్నప్పుడు..విభిన్న సంగీతం వింటున్నప్పుడు..ప్రేరేపించే భావోద్వేగాలు… మెదడులోని ఏ ప్రాంతం.. ఎలా క్రియాశీలంగా పనిచేస్తుందో కూడా పరిశోధకులు కనుగొన్నారు. సినిమాలు, సంగీతం ద్వారా ప్రేరేపించబడిన భావోద్వేగాలు, మెదడులోని విభిన్న యంత్రాగాల ఆపరేషన్‌ ఆధారంగా పాక్షికంగా ఆధారపడి ఉంటాయని… పరిశోధనా ఫలితాలు సూచిస్తున్నాయి. 
 
ఉదాహరణకు సినిమాలు నిజ జీవిత పరిస్థితుల్లో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించే మెదడులోని లోతైన భాగాలను క్రియాశీలకం చేస్తాయి. తద్వారా సహజమైన భావోద్వేగ విధానాలను క్రియాశీలకం చేయగలవని పరిశోధకులు భావించారు. 
 
ఇక సంగీత ప్రేరేపిత భావోద్వేగాల విషయానికొస్తే.. అవి సంగీత శబ్ద లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా సాంప్రదాయక సంగీతం, శాస్త్రీయ వాయిద్య సంగీతం ద్వారా ప్రేరిపిత భావోద్వేగాలను జాతీయ పీఈటీ సెంటర్‌ అధ్యయనం చేసింది.