ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి

ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గోస్వామిచే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.
 
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛంతో చీఫ్ జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామిని సత్కరించారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ సహా పలువురు న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  అంతకుముందు అనూప్ కుమార్ గోస్వామి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
అంతకుముందు జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా ఆలయానికి వెళ్లిన ఆయనకు దేవాలయ అధికారులు ఘనస్వాగతం పాలికారు. వేకువజామున జరిగిన పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.