బినామీ ఆస్తుల కేసులో  రాబర్ట్‌ వాద్రా విచారణ 

బినామీ ఆస్తుల కేసులో  రాబర్ట్‌ వాద్రా విచారణ 

కాంగ్రెస్‌  నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాను ఆదాయ పన్ను అధికారులు విచారించారు. బినామీ ఆస్తుల కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వా‌ద్రా ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు సోమవారం విచారించారు. 

యూకేలోని ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి ద్వారా కొనుగోలు చేసిన లండ‌న్ ఆస్తులతో ముడిపడి  ఉన్న ఈ కేసుకు సంబంధించి  తాజా పరిణామం చోటు చేసుకుంది. లండన్‌లో బ్రయాన్స్టన్ స్క్వేర్ భవనం సుమారు రూ 77 17.77 కోట్ల విలువైన ఆస్తితోపాటు, మరొకవిలువైన ఆస్తిని కొనుగోలు చేసిన కేసులో కూడా వాద్రాను ఈడీ విచారిస్తోంది. 

అలాగే 4 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.37.42 కోట్లు)  5 మిలియన్ పౌండ్ల (రూ. 46.77 కోట్ల కంటే ఎక్కువ) విలువైన మరో రెండు ఆస్తులను కూడా ఈడీ అక్రమ ఆస్తులుగా గుర్తించింది. వీటితోపాటు ఆరు ఫ్లాట్లు కూడా వాద్రాకు చెందినవని అనుమానిస్తున్నట్లు ఈడీ ఆరోపించింది.

2005 -2010 మధ్య  వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొంది.  మొత్తంగా లండ‌న్‌లో సుమారు 12 బిలియ‌న్ల పౌండ్లమ ఆస్తులను క‌లిగి ఉన్న కేసులో విచార‌ణ జ‌రుగుతోంది. అలాగే గుర్గావ్‌లో భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2018 సెప్టెంబర్‌లో ఆయనపై, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై కూడా పోలీసు కేసు నమోదైంది.