భారీగా దాఖలైన ఐటీ రిటర్న్‌లు

ఐటీ రిటర్న్ ల దాఖలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పొందుతున్న ప్రతీ వ్యక్తి, ఉద్యోగి ఐటీఆర్‌(ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్)ను  దాఖలు చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. 

నిజానికి ఐటీ రిటర్న్ దాఖలు చివరి తేది సహజంగా జూలై 31 తేదీగా ఉంటుంది. అయితే  కరోనా నేపధ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ తేదీని డిసెంబర్ 31 కి మార్చింది. దీంతో చివరి తేదీకి కేవలం రెండు రోజులే మిగిలి ఉన్న ప్రస్తుత దశలో  ఐటీ రిటర్న్త్‌ల దాఖలు భారీగా జరుగుతోంది.

ట్విట్టర్ వేదికగా ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. కేవలం మంగళవారం ఒక్కరోజే  మొత్తం 7.65 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌ దాఖలు చేయగా, కేవలం గంట వ్యవధిలోనే 1,35,408 మంది రిటర్న్ లు దాఖలు చేశారని వెల్లడించింది. ఇక పూర్తి వివరాలకు https://bit.ly/2YgCyk3 సంప్రదించాలని  సూచించింది.