మల్లారెడ్డి కాలేజీపై ఐదేళ్లు బ్యాన్  

మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేష‌న్ కౌన్సిల్ (న్యాక్‌) షాక్ ఇచ్చింది. కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై 5 సంవత్సరాలు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ అధికారిక వెబ్‌సెట్‌ ద్వారా ప్రకటించింది. 

వివరాల్లోకెళితే.. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. అయితే ఇంకా మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నిం చేసింది. న్యాక్ బెంగళూర్‌కు సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌లో నకిలీ డాక్యూమెంట్లను పంపించారు. 

అయితే.. న్యాక్ కౌన్సిల్ వారు ఈ విషయాన్ని పసిగట్టారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం చీటింగ్‌కు పాల్పడిందంటూ ఆ కాలేజీపై చర్యలకు ఉపక్రమించింది. అక్రిడేషన్ విషయంలో 5 సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.