బిజెపిలోకి కమల్ హాసన్  పార్టీ నేత  

తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ కు షాక్ తగిలింది. బీజేపీ దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి పుట్టిన రోజు సందర్భంగా బిజెపి నేతలు తమిళనాడులో జరిపిన పుట్టిన రోజు వేడుకలకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కమల్ హాసన్ కు షాకిస్తూ ఎంఎన్ఎం పార్టీ ఉపాధ్యక్షుడు అరుణాచలంకు కండువా కప్పి పార్టీలకి ఆహ్వానించారు. “నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి  అమిత్ షా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు ఎంత ఉపయోగకరమో నాకు బాగా తెలుసు” ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

తాను ఈ చట్టాల గురించి  మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నేతలతో, హైకమాండ్ తో వాదించానని చెప్పారు . కేంద్రప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు ఎంతో ఉపయోగకరమని, వాటికి మద్దతు తిరస్కరించారని చెప్పారు.

“అనేక సందర్భాల్లో కేంద్రం అమలు చేసిన చట్టాల్ని బీజేపీ పార్టీకి ఆపాదించవద్దని, ఆ చట్టాలు కేవలం రైతుల కోసమని వాదించా. మనం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే  ప్రతిపక్ష పార్టీకి  – అధికార పార్టీకి మధ్య తేడా ఏం ఉండదన్నా”అని అరుణాచలం తెలిపారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదని, రైతుల్ని వ్యతిరేకించే పార్టీలో తాను ఉండదలుచోలేదని అరుణాచలం ప్రకటించారు.