ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం `మినీ భారత్’ 

ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం `మినీ భారత్’ అని, ఈ విశ్వవిద్యాలయం మన దేశనైకే గర్వకారణం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)   స్థాపించి  100 ఏళ్లైన సందర్భంగా నిర్వహించిన శతాబ్ది మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
ఈ విశ్వవిద్యాలయ ఆవరణం ఒక నగరం వలే ఉంటుందని తనకు చెప్పారని, పలు విభాగాలు, డోజన్ల కొద్దీ ఆస్తళ్ళు, వేలాదిమంది అధ్యాపకులతో ఇక్కడ నెలకొనే వైవిధ్యం ఈ విశ్వవిద్యాలయంకె కాకుండా మొత్తం భారత దేశానికే శక్తీ ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
ఈ విశ్వవిద్యాల భావనలతో ముడివేసుకున్న విద్యారంగం చరిత్ర మొత్తం భారత దేశపు విలువైన వారసత్వం అని పేర్కొంటూ తాను తరచూ విదేశీ పర్యటనలలో ఇక్కడ చదివిన వారిని కలుసుకొంటూ ఉంటానని మోదీ చెప్పారు. వారంతా తామిక్కడ చదివిన్నట్లు చాలా గర్వంగా చెబుతూ ఉండేవారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఈ విశ్విద్యాలయంలో చదివినవారు ఉన్నతమైన భారత దేశం వారసత్వం, సంస్క్రుతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారని ప్రధాని ప్రశంసించారు. 
 
నూరేళ్ళ చరిత్రలో ఈ విసవిద్యాలయం కోట్లాది మంది యువకుల జీవితాలను తీర్చి దిద్దినదని, వారికి ఆధునిక, శాస్త్రీయ ఆలోచనలు కలిగించి, సమాజం, దేశం కోసం ఏదో చేయాలనే స్ఫూర్తి కలిగిస్తూ వస్తున్నదని ప్రధాని చెప్పారు. 
 
కరోనా మహమ్మారి సమయంలో దేశానికి ఈ విశ్వవిద్యాలయం అందించిన అపురూపమైన సేవలను ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఉచితంగా వేలాదిమందికి వైద్య పరీక్షలు జరపడంతో పాటు ఇసోలాటిన్ వార్డ్, ప్లాస్మా బ్యాంకు లను ఏర్పాటు చేసినదని, పీఎం కేర్స్ కు విశేషంగా విరాళాలు సమకుర్చీన్నట్లు ప్రధాని వివరించారు. 
 
ఈ దేశంలో మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి సమాన అవకాశాలు పొందుతూ, సమాన గౌరవం పొందుతూ తమ కలల్ని నిజం చేసుకుంటున్నారని ప్రధాని  మోదీ  ఈ సందర్భంగా తెలిపారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ అనే మంత్రం దీని వెనుక ఉంది’’ అని అని పేర్కొన్నారు.
 
దేశంలో ఎవరిపై వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ఆ ప్రాతిపదికనే దేశం ముందుకు కదులుతోంది. ప్రతి వ్యక్తికి రాజ్యంగపరమైన హక్కులు లభిస్తున్నాయి. భవిష్యత్‌పై భరోసాతో దేశం ముందుకు కదులుతోందని ప్రధాని పేర్కొన్నారు.
 కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ గౌరవ అతిథిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ఏఎంయూ చాన్స్‌లర్ సైద్న ముఫ్ఫద్దల్ సైఫుద్దిన్ పాల్గొన్నారు. వాస్తవానికి ఈ యూనివర్సిటీ స్థాపించి సెప్టెంబర్ 14వ తేదీతోనే వందేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్ కారణంగా శతాబ్ది ఉత్సవాలు జరపలేకపోయారు.