వేలసంఖ్యలో ప్రజలు హాజరైన ఈ మెగా ర్యాలీపై సంతృప్తి వ్యక్తం చేసిన షా ‘ఇంతటి స్పందనను చూస్తుంటే బెంగాలీలు మమత పాలనపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో మా విజయం ఖాయం’ అంటూ భరోసా వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి తృణమూల్ పీడ నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దీనికి మమత సర్కారుదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు.
‘బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తాం’ అని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పరాయి పార్టీ అంటూ టీఎంసీ పదేపదే చేస్తున్న దాడిని మళ్లీ తిప్పికొట్టారు. మీరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాబట్టి బెంగాల్లో అడుగుపెట్టొద్లని ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావుకు మమత చెప్పగలిగారా? అని షా నిలదీశారు.
‘అయినా బెంగపడకండి. మిమ్మల్ని ఓడించేది పరాయి వ్యక్తులు కాదు.. బెంగాలీలే. బీజేపీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి కూడా పరాయి వ్యక్తి కాదు. స్థానికుడే’ అని షా ప్రకటించారు.
More Stories
అమిత్ షాపై కెనడా ఆరోపణలపై భారత్ అసంతృప్తి
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం కచ్చితం
పోలింగ్ కన్నా ముందే అమెరికాలో సగంకు పైగా ఓట్లు