నేపాల్ పార్లమెంట్ రద్దు 

నేపాల్ పార్లమెంట్ రద్దు 
సొంత పార్టీలోనే ఏర్ప‌డిన ముస‌లంతో ఉక్కిరి బిక్కిరి అయిన నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి (69) ఆదివారం ఏకంగా పార్ల‌మెంట్‌నే ర‌ద్దు చేశారు. ఉద‌యం జ‌రిగిన కేబినెట్ స‌మావేశం ఈ మేర‌కు పార్ల‌మెంట్ ర‌ద్దు చేయాలంటూ అధ్యక్షుడికి సిఫార‌సు చేసిన‌ట్లు ఇంధ‌న శాఖ మంత్రి బ‌ర్ష‌మాన్ పున్ వెల్ల‌డించారు.
ప్రధాన మంత్రి సిఫార్స్ పై రాష్ట్రపతి బిధ్యా దేవి భండారి పార్లమెంట్ ను రద్దు చేశారు. తాజా ఎన్నికలను గడువుకన్నా ఒక సంవతస్రంకన్నా ముందే వచ్చే ఏప్రిల్, మే లలో జరుపుతామని ప్రకటించారు.
ఓ వివాదాస్ప‌ద ఆర్డినెన్స్ ర‌ద్దు చేయాలంటూ సొంత పార్టీ నేపాల్ క‌మ్యూనిస్ట్ పార్టీలోని ప్ర‌ధాని ఓలి ప్రత్యర్ధులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఓలి వ్య‌తిరేక వ‌ర్గానికి మాజీ ప్ర‌ధాని పుష్ప క‌మ‌ల్ ద‌హ‌ల్ ప్ర‌చండ నేతృత్వం వ‌హిస్తున్నారు. వాళ్ల‌ను బుజ్జ‌గించ‌డానికి ఓలి చాలా ప్ర‌య‌త్నాలే చేశారు.
శ‌నివారం సాయంత్రం ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీని కూడా క‌లిశారు. ఈ ఆర్డినెన్స్ విష‌యంలోనే పార్టీ చీలిక వ‌ర‌కూ వెళ్లింది. ఆ చీలికను ఆప‌డానికే ప్ర‌ధాని ఓలి  ఇలా స‌డెన్‌గా పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు భావిస్తున్నారు. మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వానికి ఆయ‌నే నేతృత్వం వ‌హించ‌నున్నారు. కీల‌క‌మైన నియామ‌కాలు చేయ‌డానికి పూర్తి అధికారం త‌న‌కు తానుగా క‌ట్ట‌బెట్టుకుంటూ గ‌త మంగ‌ళ‌వారం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్ప‌ద‌మైంది.
బుధ‌వారం స‌మావేశ‌మైన పార్టీ స్టాండింగ్ క‌మిటీ ఈ ఆర్డినెన్స్ ఉప‌సంహ‌రించుకోవాల‌ని ప్ర‌ధాని ఓలిని డిమాండ్ చేసింది. మొద‌ట్లో పార్టీ ఒత్తిడికి త‌లొగ్గినా  త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు. శ‌నివారం స్వ‌యంగా ప్ర‌పంచ ఇంటికి వెళ్లిన ప్ర‌ధాని ఓలి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించారు. అయినా ఆయన మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు.
భారత్ – చైనాల మధ్య ఉద్రిక్తలు చెలరేగుతున్న సమయంలో నేపాల్ అంతర్గత రాజకీయాలపై సహితం తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రధాని ఓలి అనుసరిస్తున్న చైనా అనుకూల విధానాలు దేశంలోని రాజకీయ వర్గాల ఉంది తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. గడువుకన్నా ముందుగానే పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న ప్రధాని నిర్ణయం సహితం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇతర రాజకీయ ప్రత్యామ్న్యాలను చూడవలసింది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీలోని తిరుగుబాటు దారులతో చేతుకు కలిపి 2017 ఎన్నికలలో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ప్రస్తుత పార్లమెంటరీ పార్టీ, పార్టీ కేంద్ర కమిటీ, కార్యదర్శివర్గంలలో ఆధిక్యత కోల్పోయిన ఓలి పార్లమెంట్ రద్దుకు ఉపక్రమించడం వివాదాస్పదంగా మారుతున్నది.