విజయ్ దివస్ సందర్భంగా ఆనాటి యుద్ధంలో మన సైన్యం పోరాడిన తీరును కొనియాడుతూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు. ఆ యుద్ధంలో త్యాగాలు చేసిన సైనికులకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాళులర్పించారు.
చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్‌తోపాటు త్రివిధ దళాల అధిపతులు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఏడాదిపాటు జరిగే కార్యక్రమాలను గుర్తు చేస్తూ దేశం నలుమూలలకూ నాలుగు జ్యోతుల్ని(కాగడాల్ని) తీసుకువెళ్తున్నారు.
విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గుర్తు చేసింది. సింహంలాంటి ఇందిరాగాంధీ (ఆనాటి ప్రధాని) నాయకత్వంలో భారత సైన్యం 1971యుద్ధంలో విజయం సాధించిందని కాంగ్రెస్ కొనియాడింది. పాకిస్థాన్‌పై చారిత్రక విజయం సాధించామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్ చేశారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌లోనూ విజయ్ దివస్‌ను జరుపుకుంటారు.

More Stories
ఝార్ఖండ్‌లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
త్వరలో ఎస్పీలో భారీ చీలిక.. బీజేపీ వైపు ఆ పార్టీ నేతలు!
ఉద్ధవ్ శివసేనను కుదిపేస్తున్న ‘ఆపరేషన్ టైగర్’