ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధం … సుప్రీం లో పిటీషన్ 

1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ప్రకటించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖైలంది. ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ 94 ఏళ్ల వృద్ధురాలు వీరా సారిన్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
దీంతో దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించింది. కాగా, 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సింది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
 
1975 నాటి ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని అయితే, 45ఏళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ అభ్యర్ధన అసలు విచారణకు సాధ్యమైనదా, . అవసరమైనదా అనే అంశాలను కూడా పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ‘ 
 
`చరిత్రలో ఒక నిర్ధిష్ట సమయంలో ఏదో తప్పు జరిగివుండొచ్చు. కానీ, ఎమర్జెన్సీ విధించి 45 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి వ్యక్తులు ఇప్పుడు మనతో లేరు’ అని పేర్కొంది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయం అని సారిన్‌ తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది హరీష్ సాల్వే స్పష్టం చేశారు. 
 
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1975 జూన్‌ 15వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 21 నెలలపాటు కొనసాగిన ఆ అత్యయికస్థితిని 1977 మార్చి నెలలో ఎత్తివేశారు.