కమల్‌నాథ్  రాజకీయాల నుండి విశ్రాంతి! 

 కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రునిగా ఉంటున్న కమల్‌నాథ్ రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.  ఛింద్‌వాడలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటూ ‘‘ఇక నేను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నా” అంటూ స్వయంగా వెల్లడించారు. 
 
“కావల్సిన పదవులన్నీ అనుభవించా. ఇక నాకు విశ్రాంతి అవసరం.’’ అని పేర్కొన్నడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలలో ఒకేసారి అలజడి ప్రారంభమైనది. అయితే ఆయన వర్గీయులు మాత్రం కేవసం పీసీసీ అధ్యక్ష పదవి మాత్రమే వదులుకుంటారని, రాజకీయాల నుండి తప్పుకోరని చెబుతున్నారు. 
 
15 ఏళ్ళ విరామం అనంతరం 2018లో రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన ఆయనతో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడి విఫలమైన జ్యోతిరాదిత్య సింధియా ఈ ఏడాది మొదట్లో బీజేపీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి, తిరిగి బిజెపి ప్రభుత్వం ఏర్పడటం తెలిసిందే. 
 
జ్యోతిరాదిత్య సింధియాతో పాటు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అత్యధికులు ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో కూడా గెలువపండడంతో అక్కడ కాంగ్రెస్ లోని యువనాయకులు కమల్‌నాథ్ పై వైరి వర్గం గుర్రుగా ఉంది.యువ నాయకత్వం లేని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నది. పైగా, ఓడిపోతారని తెలిసిన అభ్యర్థులకే కమల్‌నాథ్ టిక్కెట్లు కేటాయించారని తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.
కేంద్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ రాజకీయాల్లో చాలా కాలం పాటు కమల్‌నాథ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకున్నారు.
ఉప ఎన్నికల్లో ఓటమి, ప్రత్యర్థి వర్గం ఆరోపణలతో చుట్టుముట్టడం, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మసక బారుతున్న నేపథ్యంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని తెలుస్తున్నది.