మమతా పదేళ్ల పాలన అన్నింటా వైఫల్యం !

తన పదేళ్ల పాలనపై త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గత వారం విడుదల చేసిన ప్రగతి  నివేదిక అంతా అబద్దాలమాయం అని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ బిజెపి “టిఎంసి వైఫల్యాల కార్డు” అంటూ మరో నివేదికను విడుదల చేసింది. మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈ రాష్ట్రంలో టీఎంసీని గద్దె దింపి అధికారమలోకి రావడం కోసం బిజెపి సమాయత్తం అవుతూ ఉండడం తెలిసిందే.
పదేళ్ల మమతా పాలనా అంతా అవినీతిమయం, అసమర్ధతతో కూడుకున్నదని “టిఎంసి వైఫల్యాల కార్డు” ను విడుదల చేస్తూ బిజెపి సీనియర్ నేతలు స్వపన్ దాస్ గుప్త, శిశిర్ బజారిఆ, షామిక్ భట్టాచార్య ధ్వజమెత్తారు.
“టిఎంసి విడుదల చేసిన నివేదిక పూర్తిగా అబద్దలమయం, ప్రజలను వెర్రివాలాలను చేయడానికే. అన్ని రంగాలలో – ఆర్దిఅభివృద్ది, పరిశ్రములు, ఆరోగ్యం, విద్య, మహిళల భద్రత, ఉద్యోగాల కల్పనలలో ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమైనది” అని రాష్ట్ర బిజెపి ప్రధాన అధికార ప్రతినిధి భట్టాచార్య విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ లో గత పదేళ్లలో వచ్చిన పెట్టుబడుల గురించి టిఎంసి ప్రభుత్వమును ఒక పత్రం విడుదలచేయమని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన వ్యాపార సదస్సులు ఎటువంటి ఫలితం సాధింపలేక పోయాయని తెలిపారు. పెట్టుబడులకు గత పదేళ్లలో పలు అంతర్జాతీయ సమ్మేళనాలు జరిపిన పెట్టుబడులను రాబట్టలేక పోయారని పేర్కొన్నారు.
పైగా, రాష్ట్రంలో నెలకొన్న పలు పరిశ్రమలను `సిండికేట్ రాజ్’ వేధింపుల కారణంగా యజమానులు ఇతర ప్రదేశాలకు తరలించుకు పోయారని భట్టాచార్య ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పక్షం అండదండలతో ఏర్పడిన ఈ `సిండికేట్ రాజ్’ కాంట్రాక్టుదారులను, పారిశ్రామిక వేత్తలను తమ నుండి మాత్రమే నాసిరకం నిర్మాణ ముడి పదార్ధాలు కొనుగోలు చేయమని వత్తిడి చేస్తుంటారు.
టిఎంసి నిజమైన ప్రగతి గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసని అంటూ నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో సహితం ఈ ప్రభుత్వం ఏమీ చెప్పుకోలేక పోతున్నదని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనను “పదేళ్ల అవినీతి, పదేళ్ల దోపిడీ సిండికేట్, పదేళ్ల ప్రజాస్వామ్యం అణచివేత. ఒక పరీక్షా తప్పిన విద్యార్థి తన ప్రగతి కార్డు ను వ్రాసుకున్నట్లుగా టిఎంసి రిపోర్ట్ కార్డు ఉంది” అంటూ రాష్త్ర బిజెపి తన ట్విట్టర్ లో ఎగతాళి చేసింది.