ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన నిబంధనల ప్రకారం మహారాష్ట్ర ఉద్యోగులు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయల్లో టీ-షర్టులు, జీన్స్ ధరించడం నిషేధం.
విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగుల వస్త్రధారణ ‘‘సరైన’’ పద్ధతిలో ఉండాలని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయంలలో జీన్స్, టీషర్టులు ధరించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ప్రొఫెషనల్ స్థాయిలో తగిన ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించాలంటూ ఉత్తర్వుల్లో సూచించింది. గతంలో కూడా చాలారాష్ట్రాల్లో ఉద్యోగులు జీన్స్, టీషర్టులు ధరించకూడదంటూ ఇదే తరహాలో ఆదేశాలు వెలువడ్డాయి. కొన్నిచోట్ల స్కర్టులు ధరించరాదని కూడా ప్రభుత్వాలు ఆదేశించాయి.
గతేడాది బీహార్ ప్రభుత్వం సైతం ఉద్యోగులు క్యాజువల్ దుస్తులు ధరించడాన్ని నిషేధించింది. ‘‘కార్యాలయ సంస్కృతికి, ఆఫీసు మర్యాదకు’’ అవి విరుద్ధమంటూ ప్రభుత్వం పేర్కొంది. 2018 జూన్‌లో రాజస్థాన్ ప్రభుత్వం తమ ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించరాదంటూ హుకుం జారీ చేసింది.
తమిళనాడు ప్రభుత్వం కూడా ఉద్యోగులు తమిళ, భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింభించే దుస్తులే ధరించాలని ఆదేశించింది. 2018లో కర్ణాటక ప్రభుత్వం కూడా మహిళా ఉద్యోగులు స్కర్టులు, టీషర్టులు, ప్యాంటు ధరించరాదనీ.. పురుషులు టీషర్టులు ధరించకూడదని ఆదేశించింది.
More Stories
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
పోలీసుల మధ్య కాల్పులు .. ఉదంపూర్లో ఇద్దరు పోలీసులు మృతి
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ఆంక్షల సడలింపు