గడ్కరీ `నాగపూర్ నమూనా’తో 54 వేల మందికి ఉద్యోగాలు

కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తన పార్లమెంటరీ నియోజకవర్గం నాగ్‌పూర్‌లో ఒక నమూనాను రూపొందించారు.  దీని ద్వారా 54,000 మందికి పైగా యువకులు అనేక కంపెనీలలో ఉద్యోగాలు పొందారు.

నాగపూర్ లోని ‘మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, నాగ్‌పూర్‌లోని విమానాశ్రయం’  (మిహన్అ) నే ప్రాజెక్ట్ ద్వారా దీనిని సాధించారు. నాగ్‌పూర్, విదర్భ ప్రాంత అభివృద్ధి జరగడం ప్రారంభించడంతో, ఈ ప్రాజెక్ట్ స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంలో సహాయపడింది.

దీనితో 2014 లో గడ్కరీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చినట్లయింది. ఆ ఎన్నికలలో ఈ ప్రాంతంలో 50,000 ఉద్యోగాలను సృష్టిస్తానని హామీ ఇచ్చారు. నాగపూర్  ప్రత్యేక భౌగోళిక స్థానం కారణంగా విమాన,  రైలు రద్దీకి ముఖ్యమైన కూడలి.

దీనిని పరిగణనలోకి తీసుకుని నాగపూర్, విదర్భ ప్రాంతాలను ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చడానికి గడ్కరీ మిహాన్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ దిశగా పనులు 2009 లో ప్రారంభమయ్యాయి. తరువాత నాగ్‌పూర్‌లో స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) ఏర్పాటులో గడ్కరీ కీలక పాత్ర పోషించారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో గడ్కరీ నాగ్‌పూర్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. నరేంద్ర మోదీ  నేతృత్వంలోని ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. ఆ తరువాత ఆయన తన కలల ప్రాజెక్టుపై పనిచేయడంపై దృష్టి సారించారు.  క్రమంగా, కొన్ని పెద్ద కంపెనీలు మిహాన్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించాయి.చాలా కంపెనీలు పెట్టుబడుల కోసం ముం

దుకు వచ్చాయి. నాగ్‌పూర్‌లో ఎయిర్‌ ఇండియా కనీసం 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది, హెచ్‌సిఎల్‌ 2,500 మందికి ఉపాధి కల్పించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) 7,500 మందికి ఉపాధి కల్పించింది. అదేవిధంగా, 170 కి పైగా కంపెనీల పెట్టుబడి అవకాశాలు ఉపాధి అవకాశాలను కల్పించాయి.

గత ఆరేళ్లలో నాగ్‌పూర్‌లో 54,868 మందికి ఉద్యోగాలు వచ్చాయని నితిన్ గడ్కరీ కార్యాలయం తెలిపింది. నాగ్‌పూర్‌లో పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టులు స్థాపించిన తరువాత ఈ ఉద్యోగాలను సృష్టించారు. సెజ్‌లో మొత్తం 36,407, సెజ్ కాని ప్రాంతంలో 16,162 ఉద్యోగాలు సృష్టించారు.

అదే సమయంలో, సెంట్రల్ ఫెసిలిటీ బిల్డింగ్ మిహాన్ సెజ్ ద్వారా 2,299 మందికి ఉద్యోగాలు లభించాయి. నాగ్‌పూర్‌లోని యువతకు మిహాన్ ప్రాజెక్టు కింద ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు.